సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పంజాబ్ రైతులు.. రైల్‌రోకోను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను సోమవారం నుంచి పునఃప్రారంభించేందుకు సహకరిస్తామని తెలిపారు. సీఎం అమరీందర్ సింగ్‌తో భేటీ అనంతరం రైతుల సంఘాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి.
15 రోజుల పాటు రైల్వే కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలిగించమని రైతు సంఘాలు తెలిపాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. 15 రోజుల్లో చర్చలు జరగకపోతే తరువాత ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశాయి.
స్వాగతించిన సీఎం
రైతు సంఘాల నిర్ణయాన్ని సీఎం అమరీందర్ సింగ్ స్వాగతించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్‌కు రైలు సేవలు పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు.
ఇదీ చూడండి: 'అక్కడి రైతుల ధర్నాతో వేల కోట్లు నష్టం'