కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ ప్రభుత్వం... వ్యవసాయ కొత్త చట్టం ముసాయిదా కాపీలను ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ప్రతిపక్ష ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రాత్రి శాసనసభ భవనంలో ఉండి నిరసన తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత చట్టం ముసాయిదా కాపీని తమతో పంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమ్ఆద్మీ నేతలు డిమాండ్ చేశారు.
సాధ్యమైనంత వరకు రాష్ట్ర చట్టాలను ఉపయోగించడం ద్వారా కేంద్రంలోని కొత్త వ్యవసాయ చట్టాల ప్రభావాలను ఎదుర్కోవాలని పంజాబ్ ప్రభుత్వం చూస్తోంది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెస్తున్న చట్టానికి మద్దతిస్తామన్న ఆమ్ఆద్మీ నేతలు..... అయితే ప్రభుత్వం దాని కాపీలను తమకు సరఫరా చేయాలన్నారు. ఇతర బిల్లుల కాపీలు కూడా తమకు ఇవ్వలేదని, కాపీలు లేకుండా ముఖ్యమైన విషయాలను సభ్యులు ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: కన్సార్షియంల నుంచి రుణాలు-రూ.754 కోట్ల మోసం