ETV Bharat / bharat

బెంగళూరులో మహిళకు రెండోసారి కరోనా! - తొలి రెండోసారి కరోనా కేసు

హాంకాంగ్‌, నెదర్లాండ్స్, బెల్జియం దేశాల్లో రెండోసారి కరోనా సోకిన ఉదంతాలు వెలుగుచూశాయి. తాజాగా బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల మహిళ మరోసారి వైరస్​ బారినపడినట్లు వైద్యులు గుర్తించారు. జులైలో మొదటి సారిగా కరోనా పాజిటివ్​ రాగా... తాజాగా మళ్లీ వైరస్​ నిర్ధరణ అయ్యింది..

Private hospital reports first case of coronavirus reinfection in Bengaluru
బెంగళూరులో మహిళకు రెండోసారి కరోనా!
author img

By

Published : Sep 6, 2020, 4:46 PM IST

'కరోనా బారిన పడిన వారికి రెండోసారి మహమ్మారి సోకుతుందా?' ఈ ప్రశ్నకు విభిన్న సమాధానాలొస్తున్నాయి. కొందరు రెండోసారి కూడా వస్తుందంటే.. మరికొందరు ఆ అవకాశం చాలా తక్కువ అంటున్నారు. కానీ, ఈ మహమ్మారి రెండోసారి కూడా సోకిన ఉదంతాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గుర్తించినట్లు హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు ప్రకటించడం, నెదర్లాండ్స్, బెల్జియంలోనూ ఇలాంటి రెండు కేసులు వెలుగు చూసినట్లు వార్తలు రావడంతో ఇది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరులోనూ 27 ఏళ్ల మహిళకు రెండోసారి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు గత జూలైలో కరోనా పాజిటివ్‌ రాగా చికిత్స చేయడంతో నయమైంది. నెల రోజుల తర్వాత ఆమెకు రెండోసారి కరోనా నిర్ధరణ అయ్యింది.

"కరోనా లక్షణాలతో 27 ఏళ్ల మహిళ జులై మొదటి వారంలో ఆస్పత్రిలో చేరారు. ఆమెకు పరీక్షలు నిర్వహించిన తర్వాత పాజిటివ్‌ అని తేలింది. చికిత్స చేసిన అనంతరం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే నెగటివ్‌ రిపోర్టు వచ్చింది. జులై 24న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాము. నెల రోజుల తర్వాత ఆగస్టు చివరిలో మళ్లీ అదే లక్షణాలతో ఆస్పత్రికి వస్తే.. పరీక్షలు నిర్వహించాం. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది" అని బెంగళూరులోని ఫోర్టిస్‌ ఆస్పత్రి వైద్యుడు ప్రతీక్‌ పాటిల్‌ మీడియాకు తెలిపారు.

బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన మొదటి వ్యక్తి ఈమే కావొచ్చని చెప్పారు. తాజా కేసులో రెండోసారి మహిళకు యాంటీబాడిస్‌ పరీక్షలో నెగటివ్‌ తేలిందని వైద్యులు వెల్లడించారు. దీనిని బట్టి వైరస్‌ సంక్రమించిన తర్వాత ఆమెకు వ్యాధి నిరోధక శక్తి పెరగకపోవడమైనా ఉండాలి. లేదంటే అభివృద్ధి చెందిన యాంటీబాడీస్‌ నశించిపోయి ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా సోకిన వారందరికీ ఇది రెండోసారి సంక్రమిస్తుందని చెప్పలేమన్నారు.

కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన కొందరికి వ్యాధి లక్షణాలు పూర్తిగా నయమైన కొన్ని వారాల తర్వాత తిరిగి 'పాజిటివ్‌'గా తేలుతున్న ఉదంతాలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. అయితే, అది వారి శరీరాల్లో ఇంకా మిగిలి ఉన్న వైరస్‌ అవశేషాలు లేక ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టిందా లేక అది కొత్తగా సోకిన ఇన్‌ఫెక్షనా అన్నదానిపై శాస్త్రవేత్తల్లో స్పష్టత లేదు. ఒకసారి ఈ వ్యాధి సోకినప్పుడు శరీర రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అవి వైరస్‌ను నాశనం చేస్తాయి. అలాంటివారికి రెండోసారి వ్యాధి బారినపడకుండా రోగ నిరోధక శక్తి ద్వారా రక్షణ ఉంటుందా..? ఉంటే అది ఎంతకాలం కొనసాగుతుంది?తదితర అంశాలను నిర్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.