గ్వాలియర్ రాజమాతగా పేరొందిన భాజపా నేత విజయరాజే సింధియా జ్ఞాపకార్థం ప్రత్యేక నాణెం విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజమాత జయంతి సందర్భంగా ఆమె పేరు, ముఖచిత్రంతో ముద్రించిన రూ.100 నాణాన్ని వర్చువల్ కార్యక్రమం ద్వారా ఆవిష్కరించారు.
![Modi releases a commemorative coin of Rs 100 Rajmata Vijaya Raje Scindia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9143646_773_9143646_1602483869416.png)
రాజమాత సింధియా తన జీవితాన్ని పేదలకే అంకితమిచ్చారని మోదీ ఈ సందర్భంగా కీర్తించారు. ప్రజలకు ప్రాతినిథ్యం వహించడాన్ని అధికారంలా కాకుండా.. సేవగా భావించారని పేర్కొన్నారు. ముమ్మారు తలాక్ చట్టం తీసుకురావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో రాజమాత ఆశయాలను దేశం మరింత ముందుకు తీసుకెళ్లిందని అన్నారు.