ETV Bharat / bharat

దీటుగా బదులిస్తాం.. పాక్‌, చైనాకు మోదీ హెచ్చరికలు

రాజస్థాన్​ జైసల్మేర్​లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. పాక్​, చైనాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. సరిహద్దుల్లో భారత్​ సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని స్పష్టం చేశారు.

modi with jawans
దీటుగా బదులిస్తాం.. పాక్‌, చైనాకు మోదీ హెచ్చరికలు
author img

By

Published : Nov 14, 2020, 1:42 PM IST

Updated : Nov 14, 2020, 3:14 PM IST

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి పండగ జరుపుకొన్నారు. ఈ ఉదయం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ చేరుకున్న మోదీ.. అక్కడి లోంగేవాలా పోస్ట్‌లో సరిహద్దు జవాన్లను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న పొరుగుదేశాలు పాకిస్థాన్‌, చైనాను మోదీ పరోక్షంగా హెచ్చరించారు. భారత సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని హెచ్చరించారు.

Prime Minister Modi
స్వీట్లు పంచుతున్న మోదీ

విస్తరణవాద శక్తులకు గట్టిగా బదులిస్తాం

"ఈ రోజు యావత్‌ ప్రపంచం విస్తరణవాద శక్తులతో సమస్య ఎదుర్కొంటోంది. విస్తరణవాదం అనేది ఒక మానసిక వ్యాధి. వారింకా 18వ శతాబ్దపు భావజాలంతోనే ఉన్నారు. దీన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విస్తరణ వాదాన్ని ఎదుర్కోవడంలో భారత వ్యూహం స్పష్టంగా ఉంది. ఇతరుల అభిప్రాయాలు, విధానాలను భారత్‌ గౌరవిస్తుంది. అయితే మనల్ని పరీక్షిస్తే మాత్రం దీటైన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు భారత్‌ శత్రుదేశంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను, వారి నాయకులను హతమార్చింది. దేశ సమగ్రత, ప్రయోజనాలపై భారత్‌ ఎన్నడూ రాజీపడదు. ఈ విషయం ప్రపంచానికి కూడా అర్థమైంది" అని మోదీ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ఇంతటి గౌరవాన్ని పొందిందంటే అదంతా సైనికుల పరాక్రమాల వల్లే అని ప్రధాని కొనియాడారు.

Prime Minister Modi
జవాన్లతో మోదీ

మీతో ఉంటేనే నాకు పండగ

"ప్రతి భారతీయుడి దీపావళి శుభాకాంక్షలను నేను తీసుకొచ్చాను. మీరు(జవాన్లు) మంచు పర్వతాల్లో ఉన్నా.. ఎడారుల్లో ఉన్నా మిమ్మల్ని కలిస్తేనే నా దీపావళి పరిపూర్ణమవుతుంది. మీ ముఖంపై చిరునవ్వులు చూస్తే నా ఆనందం రెట్టింపవుతుంది" అని మోదీ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. భారత జవాన్ల శౌర్యపరాక్రమాలు అసమానమని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో ప్రపంచంలోని ఏ శక్తి మన సైనికులను అడ్డుకోలేదంటూ పరోక్షంగా చైనా, పాకిస్థాన్‌లను హెచ్చరించారు. త్రివిధ దళాలు పరస్పరం సహకరించుకుంటూ శత్రుమూకలపై విజయం సాధిస్తున్నాయని ప్రశంసించారు. ఇందుకు 1971లో పాక్‌తో జరిగిన యుద్ధమే ఉత్తమ ఉదాహరణ అని మోదీ పేర్కొన్నారు.

Prime Minister Modi
యుద్ధ ట్యాంకర్​పై ప్రయాణిస్తూ..

భారతావనికి గర్వకారణం..

దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్లకు 130 కోట్ల మంది భారతీయులు అండగా ఉన్నారని మోదీ తెలిపారు. సైనికుల ధైర్యసాహసాలు, పరాక్రమాలకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా లోంగేవాలా యుద్ధాన్ని గుర్తుచేసుకున్నారు. జవాన్ల పరాక్రమాలను మాట్లాడుకున్న ప్రతిసారీ లోంగేవాలా యుద్ధం గుర్తొస్తుందని చెప్పారు. "మీతో(జవాన్లు) ఎంత ఎక్కువ సమయం గడిపితే.. అంత ఎక్కువగా ఈ దేశానికి సేవ చేయాలనే నా కాంక్ష మరింత బలపడుతుంది" అని మోదీ చెప్పుకొచ్చారు.

మోదీ సూచనలు..

సాయుధ బలగాలకు మోదీ కొన్ని సూచనలు చేశారు. జవాన్లు యోగా చేయాలని చెప్పారు. మాతృభాష, ఇంగ్లీష్‌ కాకుండా మరో బాష నేర్చుకోవాలన్నారు. ఇవి జవాన్లలో ఉత్సాహాన్ని నింపడమేగాక, కొత్త దృక్పథాలకు తోడ్పడతాయని మోదీ అభిప్రాయపడ్డారు.

2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ ప్రతి సంవత్సరం దీపావళి పండగను సరిహద్దు జవాన్లతోనే జరుపుకొంటున్నారు.

Last Updated : Nov 14, 2020, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.