తమిళనాడులోని కులితలాయ్‌కు సమీపంలోని మెట్టు మహాదానపురంలో కురుంబా గిరిజన పండగను ఘనంగా నిర్వహించారు. ఆడి పండగలో భాగంగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి భక్తుల చేతులపై కొరడాతో కొట్టారు. అనంతరం సంప్రదాయం ప్రకారం భక్తుల తలపై కొబ్బరి కాయలు పగలగొట్టారు.
తలపై కొబ్బరి కాయలు పగలకొట్టించుకుంటే అమ్మవారు మంచి చేస్తారని భక్తుల విశ్వాసం.
నేటి ఉత్సవాల్లో 20 మంది వరకూ గాయపడ్డారు. వారికి వైద్యం చేసేందుకు పోలీసులు ఆంబులెన్స్‌లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ.... అమ్మవారికి కోపం వస్తుందనే భయంతో భక్తులు చికిత్స చేయించుకునేందుకు ముందుకు రాలేదు. గాయాలకు పసుపు, విభూతి మాత్రమే రాసుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి: వైరల్: లంచం కోసం లాఠీలతో ఖాకీల ఫైట్!