ETV Bharat / bharat

ఎన్​ఈపీపై నేడు గవర్నర్ల సదస్సు- ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగం! - President Kovind, PM Modi to address Governors' conference on NEP 2020 on Monday

నూతన జాతీయ విద్యా విధానం-2020పై నిర్వహిస్తోన్న గవర్నర్ల సదస్సులో సోమవారం ప్రసంగించనున్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొననున్నట్లు ట్వీట్​ చేశారు మోదీ.

Governors' conference on NEP 2020
ఎన్​ఈపీపై గవర్నర్ల సదస్సు'లో ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగం!
author img

By

Published : Sep 7, 2020, 5:06 AM IST

కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంపై సోమవారం గవర్నర్ల సదస్సు నిర్వహిస్తోంది కేంద్ర విద్యా శాఖ. 'ఉన్నత విద్య పరివర్తనలో జాతీయ విద్యావిధానం-2020 పాత్ర' పేరిట చేపట్టిన ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఈ మేరకు సమావేశంపై ట్వీట్​ చేశారు మోదీ.

  • At 10:30 AM tomorrow, 7th September, I will join a conference with Rashtrapati Ji, Governors & VCs of universities on the National Education Policy 2020 and its transformational impact. Deliberations from this conference will strengthen our efforts to make India a knowledge hub.

    — Narendra Modi (@narendramodi) September 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" సెప్టెంబర్​ 7 ఉదయం 10.30 గంటలకు నూతన జాతీయ విద్యావిధానం-2020, దాని ప్రభావంపై నిర్వహిస్తోన్న గవర్నర్లు, వర్సిటీల ఉపకులపతుల సదస్సులో రాష్ట్రపతితో పాటు పాల్గొననున్నాను. ఈ సమావేశంలోని చర్చలు.. భారత్​ను నైపుణ్య కేంద్రం​గా మార్చాలనే మా ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తాయి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఎన్​ఈపీ-2020పై వెబినార్లు, వర్చువల్​ సమావేశాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే కేంద్ర విద్యాశాఖ, యూజీసీ సంయుక్తంగా ఉన్నత విద్యలో సంస్కరణలపై సదస్సు నిర్వహించింది.

ఇదీ చూడండి: నూతన విద్యావిధాన ఆదర్శాలు అమలయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.