ETV Bharat / bharat

'మహా' అసెంబ్లీ పోరు: మరికాసేపట్లో పోలింగ్​ షురూ

author img

By

Published : Oct 21, 2019, 5:18 AM IST

Updated : Oct 21, 2019, 8:01 AM IST

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్​ మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పోలింగ్​ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 9 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యం తేల్చనున్నారు.

'మహా'పోరు: మరికాసేపట్లో పోలింగ్​ ప్రారంభం
మరికాసేపట్లో పోలింగ్​ ప్రారంభం

సార్వత్రిక సమరం తర్వాత దేశంలో మరో రసవత్తర పోరుకు ముహూర్తం ఆసన్నమైంది. మరికాసేపట్లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

288 అసెంబ్లీ స్థానాలకు గానూ 3 వేల 237 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 235 మంది మహిళలు. 8 కోట్ల 98లక్షల 39వేల 600మంది ఓటర్లు వీరి భవితవ్యం తేల్చనున్నారు.

పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా దాదాపు 3లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లలో డ్రోన్ల సాయంతో భద్రతను పర్యవేక్షించనుంది.

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల వివరాలు

  • నియోజకవర్గాలు : 288
  • అభ్యర్థులు : 3,237
  • ఓటర్లు: : 8,98,39,600
  • పోలింగ్ కేంద్రాలు: : 96,661
  • భద్రతా సిబ్బంది: : 3,00,000
  • పోలింగ్ సిబ్బంది: : 6,500,000
  • వీవీప్యాట్ యంత్రాలు: 1,35,021

విజయంపై ఎవరి ధీమా వారిదే..

మహారాష్ట్రలో అధికార భాజపా.. శివసేనతో జట్టుకట్టి బరిలోకి దిగింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. మోదీ ప్రజాకర్షణ, సుపరిపాలన, ఆర్టికల్​ 370 రద్దు అంశాలు అనుకూలించి మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నది కమలదళం ధీమా. మహారాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఈసారి తమకే పట్టం కడతారన్నది కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి విశ్వాసం.

ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో..

మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288. పొత్తులో భాగంగా భాజపా 164 స్థానాల్లో, శివసేన 124 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించాయి. కొన్ని మిత్ర పక్షాలు భాజపా గుర్తుతో పోటీ చేస్తున్నాయి.
కాంగ్రెస్‌ 147 స్థానాల్లో.. ఎన్సీపీ 121 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాయి. రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన 101 చోట్ల పోటీ చేస్తోంది. బీఎస్పీ 262 స్థానాల్లో, సీపీఐ 16, సీపీఎమ్‌ 8 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో దింపాయి. 1400లకుపైగా స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ప్రముఖులకు పరీక్ష..!

నాగ్‌పుర్‌ నైరుతి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఫడణవీస్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ నాందేడ్‌ జిల్లా భొకర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పృథ్వీరాజ్‌ చవాన్‌ మరోసారి సతారా జిల్లాలోని కరాడ్‌ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, యువసేన సారథి ఆదిత్య ఠాక్రే ముంబయిలోని వర్లి నుంచి బరిలో ఉన్నారు. ఠాక్రే కుటుంబీకులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

పార్టీ పోటీ చేసిన సీట్లు గెలుపు ఓట్లశాతం
భాజపా 286 122 28
శివసేన 270 63 19.35
కాంగ్రెస్​ 280 42 18
ఎన్సీపీ 282 41 17.20
ఇతరులు
20

మహారాష్ట్ర ఎన్నికల ఫలితం ఈనెల 24న వెలువడనుంది.

ఇదీ చూడండి : 'మహా'పోరు: ఓట్ల పండుగకు సర్వం సిద్ధం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Santiago - 20 October 2019
1. Various of water cannon truck spraying water at protesters
2. Protesters shouting at police peacefully
3. Policeman pointing teargas gun
4. Policeman firing teargas gun
5. Various of police arresting people
6. Teargas gun
7. Policeman walking
8. Protester trying to climb water cannon truck
9. Police standing beside graffiti reading (Spanish) "Policeman are flammable"
10. Protesters shouting, UPSOUND (Spanish) "People united will never be defeated"
11. Woman with banner reading (Spanish) "Chile (referring to people) without privileges, asking for dignity"
12. Pot being banged
13. Woman banging pot
STORYLINE:
Protests in Chile have spilled over into a new day on Sunday even after the president cancelled a subway fare hike that prompted massive and violent demonstrations.
The governor of the Santiago region says three people died in a fire at a looted supermarket early Sunday.
It's one of 60 Walmart-owned outlets that have been vandalized and the company says many stores aren't opening.
At least two airlines have cancelled flights into the capital.
President Sebastián Piñera announced Saturday night he was cancelling a subway fare hike imposed two weeks ago.
It had led to major protests that included rioting that caused millions of dollars in damage to vandalized subway stops, office buildings and stores.
A state of emergency and curfew remains in effect for six Chilean cities.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 21, 2019, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.