ETV Bharat / bharat

'స్వీయ అజెండాతో రైతు నిరసనలపై రాజకీయం'

author img

By

Published : Dec 25, 2020, 4:15 PM IST

రైతుల సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వీయ అజెండాతో రైతు నిరసనలు విపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆందోళన ప్రారంభించినప్పుడు ఎంఎస్​పీనే రైతుల ప్రధాన డిమాండ్​గా ఉందని, క్రమంగా రాజకీయ శక్తులు ప్రవేశించి సంబంధంలేని డిమాండ్లను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

PM MODI
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

రాజకీయ అజెండా కోసం రైతుల నిరసనలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హింసకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని విడుదల చేయాలనడం, రహదారులను టోల్​ ఫ్రీగా మార్చటం వంటి సంబంధం లేని విషయాలతో ఎంఎస్​పీ లాంటి కీలకాంశాలు మసకబారుతున్నాయన్నారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని ఉద్ఘాటించారు మోదీ.

కిసాన్​ సమ్మాన్​ నిధి పథకంలో భాగంగా రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రూ.18వేల కోట్లు విడుదల చేశారు మోదీ. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

PM MODI
కిసాన్​ సమ్మాన్​ నిధి సాయం విడుదల చేస్తున్న మోదీ

" కొత్త సాగు చట్టాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే వాటి ప్రయోజనాలు పొందుతున్నారు. పలు రాష్ట్రాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించటంలో రైతుల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఆందోళనలు చేపడుతున్న చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎన్నికలు జరిగాయి.

ఎన్నికల్లో తిరస్కరణకు గురైనవారు స్వీయ రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆందోళనలు చేపట్టినప్పుడు రైతులకు ఎంఎస్​పీ ఒక్కటే డిమాండ్​. కానీ, రాజకీయ శక్తులు ప్రవేశించి వారి సొంత, రైతులకు సంబంధం లేని డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ఎంఎస్​పీ, ఇతర అంశాలు కనుమరుగయ్యాయి. వారు జైళ్లలో ఉన్నవారిని విడుదల చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. రహదారులను టోల్​ ఫ్రీగా మార్చాలంటున్నారు. రైతుల సమస్యల నుంచి వారు కొత్త డిమాండ్లకు ఎందుకు మారారు? "

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

ప్రధాని ప్రసంగంలోని మరిన్ని అంశాలు..

  • స్వయం సమృద్ధత గల రైతు మాత్రమే ఆత్మ నిర్భర్​ భారత్​కు పునాది వేయగలరని అన్నారు ప్రధాని. రైతుల కోసం పని చేసే తమ ప్రభుత్వం వారి సమస్యలపై ఎప్పుడైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
  • కనీస మద్దతు ధర కింద రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేశామని, 1.5 రెట్లు మద్దతు ధర కల్పించినట్లు తెలిపారు మోదీ. గతంలో కొన్ని పంటలు మాత్రమే ఈ జాబితాలో ఉంటే.. తాము మరిన్నింటిని చేర్చి రైతులకు మేలు కలిగేలా చేశామన్నారు. రైతుల పేరిట ఆందోళన చేస్తున్న వారు.. వారి హయాంలో రైతు సమస్యలపై మాటైనా మాట్లాడలేదని ఆరోపించారు.
  • రైతుల కోసం కన్నీరు కార్చుతూ, పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్న వారి గురించి దేశం మొత్తం తెలుసునని, వారి పాలనలో ఏమి చేశారని ప్రశ్నించారు.
  • బంగాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మోదీ. పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం అమలుకు నిరాకరించి, సుమారు 70 లక్షల మంది రాష్ట్ర రైతులకు సాయం అందకుండా చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం బంగాల్​ను నాశనం చేసిందని ఆరోపించారు.
  • కేరళ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు ప్రధాని. దీర్ఘకాలంగా కేరళను పాలించిన వారు పంజాబ్​ రైతులకు మద్దతు తెలుపుతున్నారు కానీ, సొంత రాష్ట్రంలో మండీల ఏర్పాటుకు చేసిందేమీలేదన్నారు. అక్కడ ఏపీఎంసీలు, మండీలు లేవని, మరి కేరళలో నిరసనలు ఎందుకు లేవని ప్రశ్నించారు. అక్కడ వారు ఉద్యమాలు ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు.
  • కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం నిధులు విడుదల చేసిన తర్వాత 9 రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులతో మాట్లాడారు మోదీ. ఈ సందర్భంగా కిసాన్​ క్రెడిట్​ కార్డులపై తోటి రైతులకు తెలియజేయాలని వారిని కోరారు. వాటి ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉంటాయనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు.
  • తమ ప్రభుత్వంలో మధ్యవర్తులు, కమీషన్​ ఏజెంట్లకు స్థానం లేదన్నారు మోదీ. కిసాన్​ సమ్మాన్​ నిధి నగదు నేరుగా రైతుల ఖాతాల్లోకే చేరుతుందని తెలిపారు. వారికి పంపిన డబ్బు విలువ తగ్గదు, అవినీతిపరుల చేతికి వెళ్లదని సూచించారు.
  • ఒప్పంద వ్యవసాయంపై అనేక అపోహలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మోదీ. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఒప్పంద వ్యవసాయం ఉందన్నారు. డైరీ రంగంలో అది జరుగుతోందని గుర్తు చేశారు. డైరీ పరిశ్రమపై ఏ సంస్థ అయినా గుత్తాధిపత్యం చలాయిస్తున్నట్లు విన్నారా? అని ప్రశ్నించారు.
  • గత ప్రభుత్వాల హయాంలో దేశంలోని 80 శాతం మంది రైతులు నిరుపేదలుగా మారారని ఆరోపించారు మోదీ. వారి కోసమైనా వ్యవసాయ సంస్కరణలు అవసరమని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: 'సాగు చట్టాలు ఎలా ఉన్నాయో ఓ ఏడాది చూడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.