ETV Bharat / bharat

'కమిటీ ద్వారా ముందుకు' - జమిలిపై కేంద్రం

author img

By

Published : Jun 19, 2019, 8:34 PM IST

'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై దిల్లీ వేదికగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష పార్టీల సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను హోంమంత్రి రాజ్​నాథ్​సింగ్ వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా సూచనలివ్వాలన్న లక్ష్యంతో అన్ని వర్గాలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కమిటీ ద్వారా ముందుకు-జమిలిపై ప్రభుత్వం ప్రకటన

'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై కమిటీ ఏర్పాటు చేయనున్నామని రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్ ప్రకటించారు. దిల్లీ వేదికగా ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశం ముగిసిన అనంతరం సమావేశ వివరాలను వెల్లడించారు. నిర్దేశిత సమయంలోగా అన్ని పార్టీలతో చర్చించి అవసరమైన సూచనలు చేసే లక్ష్యంతో ఈ కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. చాలా పార్టీలు ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానానికి అంగీకరించాయని తెలిపారు రాజ్​నాథ్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కమిటీ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

"ఎక్కువమంది సభ్యులు ఒకే దేశం-ఒకే ఎన్నికకు మద్దతు తెలిపారు. సీపీఐ, సీపీఎం సభ్యులు ఎలా సాధ్యమవుతుందని భిన్నాభిప్రాయం తెలిపారు. ఇది ఎలా ఆచరణలోకి వస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఒకే దేశం-ఒకే ఎన్నికను విభేదించలేదు. సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకే దేశం- ఒకే ఎన్నికపై త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నాం. నిర్దేశించిన సమయం లోపల ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చించి సూచనలివ్వనుంది. ప్రధానమంత్రి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు."

-రాజ్​నాథ్​సింగ్, కేంద్ర రక్షణమంత్రి

జమిలి ఎన్నికలతో పాటు మరో నాలుగు అంశాలపై ఈ అఖిలపక్ష సమావేశం చర్చించింది.

  1. పార్లమెంటు ఔన్నత్యాన్ని పెంపొందించడం.
  2. 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం
  3. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ.
  4. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి.

పలు పార్టీల గైర్హాజరు

కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి పలు పార్టీలు దూరంగా ఉన్నాయి. జమిలి ఎన్నికలపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్​ సమావేశానికి హాజరుకాలేదు. బంగాల్​ సీఎం, తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, డీఎంకే సారథి​ స్టాలిన్​ అఖిల పక్షం భేటీకి దూరంగా ఉన్నారు.

ఇదీ చూడండి: నిష్పక్షపాతంగా సభను నిర్వహిస్తా: ఓం బిర్లా

Intro:Body:

a

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.