ఐఐటీ-2020 గ్లోబల్ సమ్మిట్‌లో శుక్రవారం కీలక ప్రసంగం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 'ది ఫ్యూచర్ ఈజ్ నౌ' థీమ్‌తో ఈ శిఖరాగ్ర సదస్సును పాన్‌ఐఐటీ యూఎస్ఏ నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణ, ఆరోగ్యం, సార్వత్రిక విద్య వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
పాన్‌ఐఐటీ యూఎస్ఏ సంస్థను స్థాపించి 20ఏళ్లు అవుతుంది. 2003 నుంచి గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది ఈ సంస్థ. పారిశ్రామిక, విద్య, ప్రభుత్వంతో సహా వివిధ రంగాలకు చెందిన వక్తలను ఆహ్వానిస్తుంది. పాన్‌ఐఐటీ యూఎస్ఏను ఐఐటీ పూర్వ విద్యార్థుల ఆల్-వలంటీర్ బృందం నిర్వహిస్తుందని పీఎంఓ తెలిపింది.
ఇదీ చూడండి: కేరళ వైపుగా ముంచుకొస్తున్న 'బురేవి'