ETV Bharat / bharat

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఐరాసలో మోదీ ప్రసంగం!

ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొవిడ్ నేపథ్యంలో ప్రపంచదేశాల మధ్య ఉండాల్సిన సహకారంపై మోదీ మాట్లాడనున్నట్లు సమాచారం.

PM to address High-Level Segment of UN ECOSOC on Friday
వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఐరాసలో మోదీ ప్రసంగం!
author img

By

Published : Jul 16, 2020, 3:16 PM IST

ఐక్యరాజ్యసమితిలో శుక్రవారం జరగనున్న అత్యున్నతస్థాయి ఆర్థిక, సామాజిక మండలి సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ప్రసంగం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సమావేశంలో మోదీతో పాటు నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కూడా మాట్లాడనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

ఈ ఏడాదికి 'కొవిడ్-19 తర్వాత బహుళత్వం : 75వ వార్షికోత్సవం నాటికి ఏ విధమైన ఐక్యరాజ్యసమితి అవసరం" అనేది ఇతివృత్తం.

రెండో విడత ప్రధానిగా భారీ మెజారిటీతో ఎన్నికైన మోదీ.. భారత్‌ ఐరాస సభ్యత్వం హోదా పెరిగిన తర్వాత తొలిసారి ప్రసంగించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో ప్రపంచదేశాల మధ్య ఉండాల్సిన సహకారం తదితరాలపై మోదీ మాట్లాడనున్నట్లు సమాచారం. భద్రతామండలిలో భారత్‌ సభ్యత్వంపై కూడా చర్చ జరగనుంది.

ఇదీ చూడండి: ఆ రాష్ట్ర మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.