ETV Bharat / bharat

'టీకా పంపిణీకి మొబైల్ సాంకేతికత సాయం'

కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో టీకా పంపిణీకి మొబైల్ సాంకేతికతను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఇండియన్​ మొబైల్​ కాంగ్రెస్​ సమావేశంలో ఆయన వర్చువల్​గా పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు.

PM Modi addresses India Mobile Congress, via video conferencing
మొబైల్ సాంకేతికతో వ్యాక్సిన్ పంపిణీ: మోదీ
author img

By

Published : Dec 8, 2020, 11:44 AM IST

Updated : Dec 8, 2020, 11:55 AM IST

ఇండియన్​ మొబైల్ కాంగ్రెస్​ సమావేశంలో వర్చువల్​గా పాల్గొని ఫారంభోపన్యాసం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే టీకా పంపిణీకి మొబైల్ సాంకేతికతనే ఉపయోగించనున్నట్లు చెప్పారు. కరోనా సంక్షోభ కాలంలో మొబైల్ సాంకేతికత ద్వారానే లక్షలాది మందికి అవసరమైన సాయం అందినట్లు మోదీ పేర్కొన్నారు.

భారత్​లో మొబైల్ టారిఫ్​లు అత్యంత చౌకగా ఉన్నాయన్నారు ప్రధాని. యాప్ మార్కెట్​ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. మొబైల్​ తయారీకి అత్యంత అనునైన ప్రదేశంగా భారత్​ ఎదుగుతోందని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని ప్రతి గ్రామంలో హైస్పీడ్ ఫైబర్ ఆప్టిక్​ డేటా సదుపాయం ఉంటుందని చెప్పారు.

"మీ ఆవిష్కరణలు, ప్రయత్నాల కారణంగానే కరోనా కాలంలోనూ ప్రపంచం కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించింది. మీ ప్రయత్నాల వల్ల ఒక నగరంలో కుమారుడు వేరే నగరంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడగలుగుతున్నాడు. తరగతి గదిలో లేకుండానే ఓ విద్యార్థి ఉపాధ్యాయుని ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నాడు. భవిష్యత్తులో లక్షలాదిమంది భారతీయులను శక్తిమంతం చేసేందుకు సమయానుగుణంగా 5జీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మనమందరం కలిసి పనిచేయాలి. సాంకేతికత ఆధునికీకరణ కారణంగా మొబైల్​ పోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తరచూ మార్చడం సంస్కృతిగా మారింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల మెరుగైన నిర్వహణకు, పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు సరికొత్త ఆలోచనల కోసం పరిశ్రమ ఒక టాస్క్​పోర్స్​ను ఏర్పాటు చేయగలదా? "

-ప్రధాని మోదీ.

కొవిడ్​ దృష్ట్యా నాలుగో విడత ఇండియా మొబైల్​ కాంగ్రెస్(​ఐఎంసీ)ను ఈసారి వర్చువల్​గా నిర్వహిస్తున్నారు. 30కి పైగా దేశాలు, 210 మంది ఉపన్యాసకులు, 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 3 వేలకు పైగా సీఈఓ స్థాయి ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి:సాగు చట్టాలపై కర్షక భారతం కన్నెర్ర

Last Updated : Dec 8, 2020, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.