దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ సమాధికి శ్రద్ధాంజలి ఘటించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. నేడు బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. బలమైన, సమర్థమైన, సౌభాగ్యవంతమైన దేశాన్ని నిర్మించేందుకు మహాత్ముడు ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటారని ట్వీట్ చేశారు మోదీ.
"జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు. శక్తిమంతమైన, సుసంపన్నమైన నవభారత దేశాన్ని నిర్మించేందుకు మహాత్ముని ఆలోచనలు ఎప్పటికీ ఆదర్శంగానే ఉంటాయి."
-మోదీ ట్వీట్.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులు అర్పించారు.
1948లో ఇదే రోజున మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: 'ఆమ్ ఆద్మీ'కి బంగాల్ దీదీ మద్దతు