కరోనా టీకా తయారీకై శాస్త్రవేత్తలు చేస్తోన్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వ్యాక్సిన్ సామర్థ్యం, పురోగతిపై మరో మూడు సంస్థల ప్రతినిధులతో మోదీ చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న జెనోవా బయోఫార్మా, బయెలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కొవిడ్ టీకాను అభివృద్ధి చేస్తోన్న మూడు కీలక సంస్థలను ప్రధానమంత్రి.. నవంబర్ 28న సందర్శించారు. అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిలా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పుణెలోని సీరం సంస్థలకు వెళ్లారు. వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీకా ఉత్పత్తి, పంపణీ సన్నద్ధతపై చర్చించారు.
- ఇదీ చూడండి: రజనీ రాజకీయ ప్రవేశంపై తొలగని సందిగ్ధం