భారత్లోని యువ శాస్త్రవేత్తలు నవ కల్పనలు, వాటిపై అధికారం, ఉత్పత్తి సామర్థ్యం, సుసంపన్న లక్షణాలను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బెంగళూరులో 107వ సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభించిన మోదీ.. ఈ లక్ష్యాలే వేగవంతమైన దేశాభివృద్ధికి మెట్లుగా పేర్కొన్నారు.
దేశం సాంకేతిక రంగంలో గత 50 సంవత్సరాల్లో సాధించలేని ప్రగతి.. ఎన్డీఏ ఈ ఐదేళ్లలో సాధించిందని పునరుద్ఘాటించారు మోదీ. ప్రపంచ నవ కల్పనల సూచీ ర్యాంకింగ్లో భారత్ 52వ స్థానానికి చేరుకోవడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు..
"నవకల్పన, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించే విజయాలపైనే భారత అభివృద్ధి ఆధారపడి ఉంది. ఈ మూడు రంగాల రూపు రేఖల్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువ శాస్త్రవేత్తలకు నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే.. నవకల్పనలు చేయండి, అసామాన్య అధికారాలు పొందండి(పేంటెంట్లు), ఆవిష్కరణలు, ఉత్పత్తులు చేసి, విజయవంతులవ్వండి. ఈ నాలుగు అంశాలు మన దేశాన్ని సత్వర అభివృద్ధి వైపు నడిపిస్తాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత సంఖ్యలో సాంకేతిక వ్యాపార కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు మోదీ. భారత్ సామాజిక, ఆర్థిక వికాసం సరికొత్త మార్గంలో నడిచేలా శాస్త్ర, సాంకేతికత ఉండాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:నేడు, రేపు కేంద్ర మంత్రిమండలి కీలక భేటీ!