ETV Bharat / bharat

నేడు 'ఎంపీ' ఫ్లాట్లను ప్రారంభించనున్న మోదీ

దేశ రాజధాని దిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల ఫ్లాట్లను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. డాక్టర్​ బీడీ మార్గ్​లో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి వర్చువల్​గా హాజరుకానున్నారు మోదీ.

PM Modi to inaugurate multi-storeyed flats for Members of Parliament
దిల్లీలో నేడు 'ఎంపీ' భవనాలను ప్రారంభించనున్న మోదీ
author img

By

Published : Nov 23, 2020, 5:03 AM IST

Updated : Nov 23, 2020, 5:54 AM IST

దిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల ఫ్లాట్​లను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు వర్చువల్​గా జరిగే ఈ కార్యక్రమంలో లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కూడా పాల్గొననున్నారు.

8 భవనాల స్థానంలో 76 ఫ్లాట్లు..

దిల్లీలోని డాక్టర్​ బీడీ మార్గ్​లో 80 ఏళ్లు దాటిన 8 భవనాల స్థానంలో.. ఎంపీల కోసం కొత్తగా 76 ఫ్లాట్లను నిర్మించారు. వీటి నిర్మాణం కోసం కేటాయించిన నిధులకన్నా.. 14 శాతం తక్కువ ఖర్చుతో నిర్మాణాలు పూర్తయ్యాయి. కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ జాప్యం లేకుండా వీటి నిర్మాణం పూర్తవ్వడం విశేషం.

ఫ్లాట్​ల ప్రత్యేకత

ఈ భవనాల నిర్మాణంలో పర్యావరణహితమైన పద్ధతులు పాటించారు. ఫ్లై యాష్​తో చేసిన ఇటుకలను నిర్మాణంలో వాడారు. సమర్థంగా విద్యుత్ వినియోగం కోసం డబుల్ గ్లేజ్​డ్ కిటికీలు, ఎల్​ఈడీ లైట్లను ఉపయోగించారు. మనుషులు ఉన్నప్పుడు మాత్రమే లైట్లు వెలిగేలా సెన్సర్లు, తక్కువ విద్యుత్​ను వాడుకునేలా వీఆర్​వీ వ్యవస్థతో కూడిన ఏసీలు బిగించారు. వర్షపు నీటి సేకరణకు ప్రత్యేక వ్యవస్థ సహా.. పైకప్పుపై సోలార్​ వంటివి ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: టీకా అత్యవసర అనుమతులపై కేంద్రం దృష్టి

Last Updated : Nov 23, 2020, 5:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.