దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో ఉన్నారు. కరోనా ప్రభావంతో కుప్పకూలిన ఆర్థిక రథాన్ని మళ్లీ పరుగులు పెట్టించేందుకు మరో భారీ ప్యాకేజీ తెచ్చే అవకాశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో ఆర్థిక మంత్రి.. మోదీకి వివరిస్తున్నారు.
కరోనా వైరస్ ప్రభావం నుంచి దేశ ఆర్థిక రంగాన్ని కాపాడేందుకు మే లో రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మనిర్భర్ భారత్' ప్యాకేజీని ప్రకటించింది మోదీ ప్రభుత్వం.