ETV Bharat / bharat

'భారతీయుల ఆశయాలను కరోనా సంక్షోభం అడ్డుకోలేదు' - యూఎస్​ ఇండియా

pm-modi-addresses-leadership-summit-of-us-india-strategic-and-partnership-forum
'యూఎస్​ఐఎస్​పీఎఫ్'​ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం
author img

By

Published : Sep 3, 2020, 9:06 PM IST

Updated : Sep 3, 2020, 9:40 PM IST

21:37 September 03

ఆత్మనిర్భర్​తో..

ఎన్నో విషయాలపై కరోనా సంక్షోభం ప్రభావం చూపించినప్పటికీ.. 130కోట్ల మంది భారతీయుల ఆశయాలను అడ్డుకోలేకపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అమెరికా, భారత్​ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం( యూఎస్​ఐఎస్​పీఎఫ్​) మూడో వార్షిక సదస్సులో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్​ భారత్​ అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని.

"దేశాన్ని ఆత్మనిర్భర్​ భారత్​గా తీర్చిదిద్దాలని 130కోట్ల మంది భారతీయులు సంకల్పించారు. ఇది భారత శక్తిని పెంపొందించి.. అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించేందుకు ఉపయోగపడుతుంది. దేశంలో ఎన్నో సవాళ్లున్నాయి. అదే సమయంలో ఫలితాలను అందించగలమన్న విశ్వాసం ఉన్న ప్రభుత్వం ఇక్కడుంది. సులభతర వాణిజ్యంతో పాటు సులభతర జీవితం కూడా ముఖ్యం."

           ---- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

సామర్థ్యం, ప్రజా ఆరోగ్య-ఆర్థిక వ్యవస్థకు కరోనా సంక్షోభం ఎన్నో సవాళ్లు విసిరిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కొత్త ఆలోచన విధానాన్ని ఏర్పరచుకోవాలని వెల్లడించారు.

దేశంలో మానవ వనరులు తక్కువగా ఉన్నప్పటికీ.. కరోనా మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని పేర్కొన్నారు మోదీ. రికవరీ రేటు పెరుగుతోందన్నారు.

21:19 September 03

సంక్షోభం ఉన్నా...

ఎన్నో అంశాలపై కరోనా సంక్షోభం చూపించిందని.. కానీ 130కోట్ల మంది భారతీయుల ఆశయాలను మాత్రం ఏం చేయలేకపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో మానవ వనరులు తక్కువ ఉన్నప్పటికీ.. కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని వెల్లడించారు.

20:06 September 03

'యూఎస్​ఐఎస్​పీఎఫ్'​ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం

అమెరికా, భారత్​ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం( యూఎస్​ఐఎస్​పీఎఫ్​) మూడో వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం, సంబంధాల బలోపేతం సహా కీలక అంశాలపై ప్రసంగిస్తున్నారు.

Last Updated : Sep 3, 2020, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.