క్రికెట్ ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. న్యూజిలాండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమి నిరుత్సాహపరిచినా.. భారత జట్టు చివరి వరకు పోరాటం చేసిన తీరు అద్భుతమని కొనియాడారు.
టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత జట్టు గొప్ప ప్రదర్శన చేసిందని ప్రశంసించారు ప్రధాని. జీవితంలో గెలుపు, ఓటములు సహజమని తెలిపారు. భవిష్యత్తులో టీమిండియా మంచి ప్రదర్శన చేయాలని ఆకాక్షించారు.
ఇదీ చూడండి: జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్ వృథా... ఫైనల్లో కివీస్