ETV Bharat / bharat

కరోనా కాలంలో మాంసం తినడంపై సుప్రీంలో వ్యాజ్యం

కరోనా కాలంలోనూ మాంసం తినొచ్చని కేంద్రప్రభుత్వం జారీ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వైరస్​ ఎక్కడి నుంచి వచ్చిందో తేలే వరకు ఆ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు పిటిషనర్లు.

Plea in SC challenges circular on meat consumption during COVID-19
చికెన్​ లేదు..చికును ముక్క లేదు.. మాంసం ప్రియుల అవస్థలు
author img

By

Published : Apr 24, 2020, 1:15 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మాంసాహారం తినడం తగ్గించారు. కానీ మాంసం తిన్నా ప్రమాదం ఏమీ లేదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్చి 30న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్​ జారీ చేసింది కేంద్రం. అయితే ఈ సర్క్యులర్​పై స్టే కోరుతూ విశ్వ జైన్ సంఘటన్​... సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.

"ప్రాణాంతక వైరస్​ చైనాలో ప్రబలినప్పడు అక్కడి ప్రభుత్వం హువానన్​ సీఫుడ్​ మార్కెట్​ను పూర్తిగా మూసివేసింది. కానీ మనం దేశంలో మాంసాహారం వినియోగించడం సురక్షితమని కేంద్ర మంత్రిత్వ శాఖ అంటుంది. ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్రవేత్తలు అంతిమ వైరస్​ వాహకాన్ని కనుగొనటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశోధనల తుది ఫలితం కోసం ఎదురు చూడకుండా.. అటువంటి సలహా ఇవ్వడానికి మంత్రిత్వ శాఖకు అధికారం, అర్హత లేదు."

-విశ్వజైన్​ సంఘటన్

వ్యవసాయాధారిత ఆహారం లభ్యమవుతున్నప్పటికీ... మహమ్మారి సమయంలో మాంసం వినియోగం మానవ జాతి ఉనికిని దెబ్బతీస్తుందని పిటిషన్​లో పేర్కొన్నారు విశ్వజైన్ సంఘటన్ ప్రతినిధులు. కేవలం మాంసం విక్రయదారులను దృష్టిలో ఉంచుకొని.. మాంసాహారం తినమని ప్రజలకు కేంద్రం పిలుపునిచ్చిందని ఆక్షేపించారు.

ఇదీ చూడండి: కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.