ETV Bharat / bharat

శబరిమల: నేటితో ముగియనున్న 41 రోజుల నిత్యపూజ - శబరిమల అయ్యప్ప దేవాలయం

శబరిమల అయ్యప్ప దేవాలయంలో 41 రోజుల నిత్యపూజలు నేటితో ముగియనున్నాయి. శుక్రవారం మండల పూజ నిర్వహించి సాయంత్రం ఆలయాన్ని మూసివేయనున్నారు పూజారులు. ఈసారి ఎలాంటి నిరసనలు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన నేపథ్యంలో శబరి గిరికి భక్తులు పోటెత్తారు. భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారం మూసివేసిన ఆలయం మకరవిలక్కు(మకరజ్యోతి) ఉత్సవాలకు డిసెంబర్​ 30న తిరిగి తెరుచుకోనుంది.

Sabarimala
'అయ్యప్ప' ఆలయానికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : Dec 27, 2019, 5:31 AM IST

Updated : Dec 27, 2019, 6:47 AM IST

శబరిమల: నేటితో ముగియనున్న 41 రోజుల నిత్యపూజ

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో 41 రోజుల పాటు సాగే తొలి దశ నిత్య పూజలు నేటితో పూర్తి కానున్నాయి. పవిత్రమైన మండల పూజ నిర్వహించి శుక్రవారం సాయంత్రం ఆలయాన్ని మూసివేయనున్నారు పూజారులు. గత ఏడాది ఇదే సమయంలో మహిళల ప్రవేశంపై పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినప్పటికీ.. ఈ సంవత్సరం ప్రశాంతంగా అయ్యప్ప దర్శనం చేసుకున్నారు భక్తులు.

భారీ ఆదాయం..

తొలి దశ 41 రోజుల నిత్యపూజ కార్యక్రమం గత నవంబర్​ నెలలో 16వ తేదీన ప్రారంభమైంది. సుమారు నెలన్నర పాటు పూజల అనంతరం డిసెంబర్​ 27 తో తొలిదశ ముగుస్తుంది. ఈసారి అయ్యప్ప కొండకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిరసనలకు తావులేకుండా కట్టుదిట్టమన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 2018లో ఇదే సమయానికి రూ.105.29 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అది రూ.156 కోట్లకు చేరింది. 2017లో అత్యధికంగా రూ.164.03 కోట్ల ఆదాయంతో రికార్డుగా నిలిచింది. ఈ ఏడాది అయ్యప్ప ప్రసాదం 'అరవన' విక్రయంతో రూ.67.77 కోట్లు సమకూరినట్లు ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు వెల్లడించింది. నాణేల లెక్కింపు కూడా చేస్తున్నందన ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

మహిళల ప్రవేశంపై ఆంక్షలు..

గత ఏడాది మహిళల ప్రవేశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. మహిళలు ఆలయానికి రావాలనుకుంటే కోర్టు అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. కొందరు యువతులు కొండపైకి వచ్చేందుకు ప్రయత్నించగా వారిని అనుమతించలేదు అధికారులు.

డిసెంబర్​ 30న పునఃదర్శనం..

41 రోజుల నిత్యపూజల అనంతరం నేడు మూసివేసిన ఆలయాన్ని ఈనెల 30న మకరవిలక్కు ఉత్సవం(మకరజ్యోతి దర్శనం) కోసం తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 21 వరకు భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తారు.

ఇదీ చూడండి: గ్రహణం లెక్క తేల్చిన రోకలి-సూదులు!

Last Updated : Dec 27, 2019, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.