సిక్కు యాత్రికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డేరాబాబా నానక్ నుంచి కర్తార్‌పుర్ నడవా ప్రధాన ద్వారం వరకు బస్సు సర్వీసును ప్రారంభించింది పంజాబ్ ప్రభుత్వం. ఈ రోజు నుంచి బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రజియా సుల్తానా వెల్లడించారు.
"డేరాబాబా నానక్ వద్ద ఉదయం 8.45గంటలకు బస్సు ప్రారంభమవుతుంది. 9 గంటలకు కర్తార్‌పూర్ సాహిబ్ నడవా ప్రధాన ద్వారం వద్దకు చేరుస్తుంది. సాయంత్రం మరలా 5.15 గంటలకు నడవా నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా బస్సుల సంఖ్య పెంచుతాం."
- రజియా సుల్తానా, పంజాబ్ రవాణాశాఖ మంత్రి.
ఇతర ప్రధాన నగరాల నుంచి డేరా బాబా నానక్‌కు కొన్ని బస్సులను నడపాలని పంజాబ్ రోడ్డు రవాణా సంస్థను ఆదేశించారు రజియా సుల్తానా.
ఇదీ చూడండి : 76వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ జెండాలతో నిరసనలు