న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రూ.1 జరిమానా కట్టారు. అయితే, తీర్పుపై సమీక్ష పిటిషన్ వేస్తానని స్పష్టంచేశారు. జరిమానా కట్టినంత మాత్రాన తీర్పును అంగీకరించినట్లు కాదని వ్యాఖ్యానించారు.
జరిమానా కట్టిన తర్వాత సోమవారం మీడియాతో మాట్లాడారు భూషణ్. దిల్లీలో పౌరసత్వ చట్టం వ్యతిరేక అల్లర్లలో అరెస్టులు, అభియోగాల నమోదుపై కేంద్రంపై విమర్శలు చేశారు.
"సీఏఏ అల్లర్ల కేసులో జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం నేత సీతారం ఏచూరి, యోగేంద్ర యాదవ్, జయతి ఘోష్, ఆపూర్వానంద్ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. విమర్శించే వాళ్ల నోళ్లు నొక్కేయడానికి ప్రభుత్వం అన్ని రకాల వ్యూహాలను ప్రయోగిస్తోంది. దర్యాప్తు పేరుతో శాంతియుతంగా నిరసన తెలిపినవారిపై పోలీసులు కుట్ర చేస్తున్నారు."
-ప్రశాంత్ భూషణ్
మాజీ సీజేఐ మద్దతు..
ప్రశాంత్ భూషణ్‌కు మాజీ సీజేఐ జస్టిస్ మదన్ లోకూర్ మద్దతు తెలిపారు. ప్రజలు రాజ్యాంగ పరిమితుల్లో మాట్లాడినప్పటికీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోందని ఆరోపించారు. రాజ్యద్రోహం చట్టంతో భావ ప్రకటనా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు.
సుప్రీం తీర్పు..
కోర్టు ధిక్కరణ కేసులో భూషణ్‌కు అత్యున్నత న్యాయస్థానం ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ ఆగస్టు 31న తీర్పునిచ్చింది. ఈ మొత్తాన్ని సెప్టెంబర్ 15లోపు కోర్టుకు డిపాజిట్ చేయాలని, లేదంటే మూణ్నెల్లు జైలు, మూడేళ్ల పాటు ప్రాక్టీస్‌పై నిషేధం విధిస్తామని హెచ్చరించింది.
ఇదీ చూడండి: భూషణ్ కేసు: రూపాయి జరిమానా లేదా మూణ్నెల్లు జైలు