రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేసి శాసనసభల్లో ఎమ్మెల్యేలు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళిని రూపొందిస్తామన్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. చట్ట సభ సభ్యులను మరింత సమర్థులుగా తయారుచేసి... వాయిదాలను నివారించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
పార్లమెంట్ వేదికగా రాష్ట్రాల శాసనసభాపతులతో సదస్సు నిర్వహించారు లోక్సభ స్పీకర్.
ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ స్పీకర్లు, శాసనమండలి ఛైర్పర్సన్లు హాజరయ్యారు.
రాష్ట్రాల స్పీకర్లతో సమావేశం ఫలప్రదంగా జరిగిందని... ప్రజాప్రతినిధుల్లో సమర్థతను పెంచేందుకు నూతన నిబంధనలను రూపొందించాల్సిందేనని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు ఓం బిర్లా. శాసనసభ కార్యకలాపాలు సజావుగా సాగాలని స్పీకర్లు అభిప్రాయపడినట్లు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల శాసనసభల డిజిటలైజేషన్ ప్రక్రియల గురించి చర్చించామని... ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు లోక్సభ స్పీకర్.
పార్లమెంటు ఉభయసభల సభ్యులకు ప్రవర్తన నియమావళిని రూపొందిస్తామని ఇంతకుముందే ప్రకటించారు ఓం బిర్లా.
ఇదీ చూడండి: ఆచితూచి వేయాలి అడుగు..!