ETV Bharat / bharat

భారత్‌కు ఉగ్ర మరక అంటించబోయి బోర్లాపడ్డ పాక్​ - భారత్​పై పాక్​ కుట్ర

కుట్రలు, కుతంత్రాల విషయంలో ముందుండే పాకిస్థాన్‌ తాజాగా మరోసారి భారీ దొంగ నాటకానికి విఫలయత్నం చేసింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వప్రతినిధి సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే వేళ భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ఆ దేశం పెద్ద ‘విద్రోహ’ కుట్రనే పన్నింది. భారత భద్రతా సంస్థ అప్రమత్తమై చెక్‌ చెప్పేసరికి ఆ దేశానికి భంగపాటు తప్పలేదు.

భారత్‌కు ఉగ్ర మరక అంటించబోయి బోర్లాపడ్డ పాక్​
author img

By

Published : Sep 28, 2019, 6:34 AM IST

Updated : Oct 2, 2019, 7:28 AM IST

భారత్​కు ఉగ్రమరక అంటించేందుకు పాకిస్థాన్​ పెద్ద కుట్రే పన్నింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే వేళ పెద్ద వ్యూహమే రచించింది. మరో ‘కుల్‌భూషణ్‌ జాదవ్‌’ను సృష్టించేందుకు యత్నించింది. భారత భద్రతా సంస్థ అప్రమత్తమయ్యేసరికి దాయాదులకు భంగపాటు తప్పలేదు.

డి.వేణుమాధవ్‌ అనే ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఈ కుట్ర పన్నింది. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన చదువులో అద్భుతంగా రాణిస్తూ పవర్‌ సిస్టమ్స్‌లో ఎంటెక్‌ చేశారు.

ఆర్‌పీజీ గ్రూప్‌నకు చెందిన కేఈసీ ఇంటర్నేషనల్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులను ఆ సంస్థ చేస్తోంది. యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్థాన్‌లోనూ పునర్‌నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. ఈ విధుల కోసం 2016 డిసెంబర్‌లో వేణుమాధవ్‌ కూడా అఫ్గాన్‌ వెళ్లారు. అంతకుముందు వరకూ ఆయన చెన్నైలో పనిచేశారు. అఫ్గాన్‌లోని దష్ట్‌ ఎ అల్వాన్‌ వద్ద 500 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్నారు.

ఐఎస్‌ఐ కన్ను

వేణుమాధవ్‌పై పాక్‌ సైనిక గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ కన్నేసింది. ఆయనను తప్పుడు ఉగ్రవాద కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నింది. 2015లో 29 మంది మరణానికి కారణమైన పెషావర్‌ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడి కేసులో ఆయనను ఇరికించాలనుకుంది. అందులో భాగంగా ఆయనపై పెషావర్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తారిక్‌ గిదార్‌ గ్రూప్‌ (టీజీజీ)నకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఆర్థిక సాయాన్ని అందించినట్లు వేణుమాధవ్‌పై తప్పుడు కేసు పెట్టింది. పెషావర్‌లోని సైనిక పాఠశాలలో 132 మంది చిన్నారుల ఊచకోతకు సంబంధించి టీజీజీపై ఆరోపణలున్నాయి.

బోగస్‌ ఆధారాలతో ఐరాస వద్దకు..

పాక్‌ ఈ తప్పుడు కేసుతో వేణుమాధవ్‌ చుట్టూ కట్టుకథలు అల్లుతూ ఒక బోగస్‌ నివేదికను రూపొందించింది. దీనికి ఎఫ్‌ఐఆర్‌లు, ఫొటోలు, ఇతర కల్పిత ఆధారాలను జతచేసింది. ఐసిస్‌, అల్‌ఖైదా, జమాత్‌ ఉల్‌ అహ్రార్‌, టీజీజీ, తెహ్రాక్‌ ఏ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ), ఐసిస్‌ వంటి పాక్‌ వ్యతిరేక ముఠాలకు ఆర్థిక సాయం, ఆయుధాలను సరఫరాకు ఆయన తోడ్పాటు అందించినట్లు చిత్రీకరించింది.

ప్రధాని మోదీ అమెరికా పర్యటన, ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి ప్రసంగం ఉండటం వల్ల ఈ నెలలో ఐరాస భద్రతా మండలిలోని ‘1267 ఆంక్షల కమిటీ’ ముందుకు దీన్ని తెచ్చింది. వేణుమాధవ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద జాబితాలోకి చేర్పించేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలకు చైనా మద్దతుగా నిలిచింది.

వాస్తవానికి వేణుమాధవ్‌ 2016 వరకూ చెన్నైలోనే ఉన్నప్పటికీ 2015లో పాక్‌లో ఉగ్రవాద చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ కమిటీలో భారత్‌ సభ్య దేశం కాకపోవడం వల్ల పాక్‌ దుష్ట ప్రయత్నాలు ఐరాసలోని భారత దౌత్యాధికారుల దృష్టికి రాలేదు.

దొంగే.. దొంగ అన్నట్లు..

నిజానికి అంతర్జాతీయ సమాజ ఆంక్షలను ఎదుర్కొనే ప్రమాదం పాకిస్థాన్‌కే పొంచి ఉంది. ఐరాస నిషేధం ఎదుర్కొంటున్న మసూద్‌ అజార్‌, హఫిజ్‌ సయీద్‌ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న ఈ దేశంపై ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) వచ్చే నెలలో కొరడా ఝళిపించే అవకాశం ఉంది. ఉగ్రవాద ఆర్థిక మూలాలపై దృష్టిసారించే ఈ సంస్థ.. 27 అంశాల్లో చర్యలు చేపట్టాలని పాక్‌కు స్పష్టంచేసింది. అయితే ఆ దేశం ఆరు అంశాలపైనే స్పందించింది. ఇలాంటి పాక్‌.. ఉగ్రవాద బాధిత దేశమైన భారత్‌పై లేనిపోని నిందలు వేస్తోంది.

మెరుపు వేగంతో భారత్‌ స్పందన..

పాక్‌ పన్నాగం గురించి ఆలస్యంగా ఉప్పందుకున్న భారత నిఘా వర్గాలు మెరుపు వేగంతో స్పందించాయి. ఈ నెల 7న వేణుమాధవ్‌ను ఆగమేఘాల మీద భారత్‌కు తిరిగి రప్పించాయి. ఒకవేళ ఆయనను వెనక్కి తీసుకురాకుంటే ఆయనను అఫ్గాన్‌ నుంచి ఐఎస్‌ఐ అపహరించి, పాక్‌కు తరలించేది. ఇరాన్‌లో వ్యాపారం చేస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ విషయంలోనూ పాక్‌ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. వేణుమాధవ్‌ తప్పించుకున్నప్పటికీ తాలిబన్‌ ముష్కరులు కేఈసీకి చెందిన ఆరుగురు ఉద్యోగులను అపహరించారు.

ఏమిటీ ‘1267 ఆంక్షల కమిటీ’

అమెరికాపై ‘సెప్టెంబర్‌ 11’ దాడుల తర్వాత ఉగ్రవాద చర్యల కట్టడికి ఐరాసలోని భద్రతా మండలిలో ‘1267 ఆంక్షల కమిటీ’ని ఏర్పాటుచేసింది. కరుడుగట్టిన ముష్కరులను ‘అంతర్జాతీయ ఉగ్రవాదులు’గా ఈ కమిటీ ప్రకటిస్తుంది. ఇలాంటి వారి ఆస్తులను స్తంభింపచేయడం, ప్రయాణాలను నిషేధించడం, వారికి ఆయుధాలు అందకుండా చూడటం వంటి చర్యలను అన్ని దేశాలూ చేపట్టాల్సి ఉంటుంది.

New Delhi, Sep 28 (ANI): Union Minister Giriraj Singh on Friday said that population growth is like a cancer. While addressing an event, he said, "Whenever I raise the issue of population control people bring religion into it. It (population growth) has become a cancer, if young leaders don't take it up and leaves it all to Modi then this cancer will get into 4th stage and become incurable."
Last Updated : Oct 2, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.