ETV Bharat / bharat

పాక్​ కాల్పులు- భారత జవానుకు గాయాలు - cease fire violation by pak in 2020

పాకిస్థాన్ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను గాయపడ్డారు. పాక్ కాల్పులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టినట్లు అధికారులు తెలిపారు.

Pakistan opens fire along LoC in J-K's Macchil sector; soldier injured
పాక్ కాల్పుల్లో భారత సైనికుడికి గాయాలు
author img

By

Published : Sep 28, 2020, 5:14 PM IST

Updated : Sep 28, 2020, 6:34 PM IST

పాకిస్థాన్ సైన్యం ఒక్క రోజులో రెండు సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్ రాజౌరీ జిల్లా, ​ కుప్వారాలో కాల్పులకు తెగబడింది. కుప్వారా మాచిల్ సెక్టార్ నియంత్రిణ రేఖ వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాను పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

"నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కాల్పులకు తెగబడింది. మోర్టార్ షెల్స్, ఆయుధాలతో పాక్ దాడికి దిగింది. భారత సైన్యం ఇందుకు సమాధానమిచ్చింది."

-భారత సైన్యాధికారి

రాజౌరీ జిల్లాలోనూ పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరిపింది.

"దాదాపు మధ్యాహ్నం 3.50 నిమిషాల ప్రాంతంలో రాజౌరీలో కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. ఓ మోస్తరు నుంచి భారీ ఆయుధాలును ఉపయోగించి దాడికి పాల్పడింది. "

-భారత సైన్యాధికారి

సెప్టెంబర్ నెలలో దాదాపు 44 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. సుందర్బాని సెక్టార్​లో ఆదివారం రాత్రి పాక్ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కేరీ సెక్టార్లో సెప్టెంబర్ 2న ఓ జేసీఓ ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాదికి జీవితఖైదు

Last Updated : Sep 28, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.