ETV Bharat / bharat

ఉగ్రవాదుల ఫేక్​ లిస్ట్​తో కశ్మీర్​పై పాక్​ కొత్త కుట్ర! - isi plan on kashmir

కశ్మీర్​లో ఉగ్రవాదులకు లేని ప్రచారం కల్పించాలని పాక్​కు చెందిన సంస్థలు భావిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కశ్మీర్​లోని తాజా పరిస్థితులు. 10 మంది ఉగ్రవాదల పేర్లతో మోస్ట్ వాంటెడ్​ జాబితా చలామణీలోకి వచ్చింది. ఇది కచ్చితంగా పాక్​కు చెందిన నిఘా సంస్థ కుట్రేనని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు.

militants
ఉగ్రవాదుల జాబితా
author img

By

Published : May 15, 2020, 6:10 PM IST

కశ్మీర్​లో టాప్​ 10 ‘మోస్ట్ వాంటెడ్’ ఉగ్రవాదుల పేర్లతో ఓ జాబితా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిని భద్రతా సంస్థలు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ జాబితాకు సంబంధించి మూలాలపై ఎవరికీ స్పష్టత లేదు.

కశ్మీర్​ లోయలో మూడు భద్రతా సంస్థలు కీలకంగా పనిచేస్తాయి. ఇవి సైన్యం, సీఆర్​పీఎఫ్​, జమ్ముకశ్మీర్​ పోలీసు విభాగం. వీటిలో ఏ సంస్థ కూడా జాబితాను అధికారికంగా విడుదల చేయలేదని స్పష్టం చేశాయి.

పాక్​ పనేనా!

ఇది పాకిస్థాన్​కు చెందిన పనిగా పలువురు అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులకు అతిగా ప్రచారం కల్పించి, వారికి ప్రజల్లో లేని ఆదరణను పెంచేందుకే పాక్​ నిఘా సంస్థ-ఐఎస్​ఐ కుట్ర పన్ని ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయంపై ఈటీవీ భారత్​ ప్రతినిధితో ఓ భద్రతా అధికారి మాట్లాడారు.

"దేశంలోని ఏ భద్రతా సంస్థ దీన్ని జారీ చేయకపోతే.. ఇది కచ్చితంగా సరిహద్దు ఆవల నుంచి వచ్చినదే. అదే నిజమైతే.. పాక్ నిఘా సంస్థ ఐఎస్​ఐ లేదా దాని అనుబంధ సంస్థల పనే ఇది."

- భద్రతా అధికారి

ఇలా చేయటం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అధికారి అనుమానించారు. ఉగ్రవాదుల్లో క్రియాశీలకంగా ఉన్నవారిని గానీ.. ఎదురుకాల్పుల్లో చనిపోయిన వారిని గానీ పేర్లను బహిర్గతం చేయవద్దని ఇటీవల భారత ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ప్రాచుర్యం కల్పించవద్దని తెలిపింది. ఈ వ్యూహాన్ని దెబ్బతీసేందుకే ఈ పని చేసి ఉంటారని ఆయన అన్నారు.

"ఈ చర్య చనిపోయిన లేదా క్రియాశీలకంగా ఉగ్రవాదులకు ప్రచారం కల్పించే లక్ష్యంతోనే చేసింది. ఫలితంగా వారిపై సానుభూతి ఏర్పడి అమాయకులు తుపాకులు పట్టుకునేలా ప్రోత్సహించేందుకే ఈ కుట్ర. హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల సమయంలో ఉద్వేగానికి లోనయ్యే యువతకు వల వేస్తారు. 2016 జులై 9న బుర్హన్​ వనీ హతమైనప్పుడు ఇదే జరిగింది. చాలా మంది యువత ఉగ్రవాదం వైపు మళ్లారు. "

- భద్రతా అధికారి

లేని ప్రచారం ఎందుకు?

ఇటువంటి కారణాలతోనే ఉగ్రవాదుల పేర్లను బహిర్గతం చేయకుండా కొత్త విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హిజ్బుల్ ముజాహిద్దీన్​ కీలక సభ్యుడు రియాజ్ నాయికూను మే 6న చంపిన తర్వాత నుంచి దేశంలో కొత్త విధానం ప్రారంభమైంది. దీని గురించి సైన్య అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్​ ఇటీవల స్పష్టతనిచ్చారు.

"చనిపోయిన ఉగ్రవాదుల పేర్లను మేం వెల్లడించం. వారికి లేని కీర్తి ఆపాదించం. వాళ్లు కేవలం ఉగ్రవాదులు. అంతే."

- కల్నల్ అమన్ ఆనంద్​

రెండు సార్లు..

దేశంలో ఇప్పటివరకు రెండు సార్లు 'మోస్ట్ వాంటెడ్​' జాబితాను భద్రతా దళాలు విడుదల చేశాయి. 2018 ఏప్రిల్​ 3న ఏడుగురు ఉగ్రవాదులతో మొదటిది, అదే ఏడాది జూన్​ 22న 21 మందితో రెండో జాబితాను ప్రకటించాయి.

ప్రస్తుతం చలామణీలోకి వచ్చిన 10 మంది ఉగ్రవాదుల జాబితాలో హిజ్బుల్ ముజాహిదీన్​కు చెందిన ఐదుగురు, జైషే మహమ్మద్​ నుంచి ముగ్గురు, మరో ఇద్దరు లష్కరే తొయిబాకు చెందినవారు.

(రచయిత- సంజీవ్ కుమార్​ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.