ETV Bharat / bharat

'పాక్​, అమెరికాలా కాదు.. భారత్​ ఎప్పటికీ లౌకిక రాజ్యమే'

author img

By

Published : Jan 22, 2020, 1:18 PM IST

Updated : Feb 17, 2020, 11:34 PM IST

పాకిస్థాన్​, అమెరికా దేశాలను మతాధికార పాలిత రాజ్యాలుగా అభివర్ణించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్. భారతదేశం మాత్రం ఎప్పటికీ లౌకిక రాజ్యమేనని పునరుద్ఘాటించారు​.

Pakistan, 'even America' are theocratic states, India is secular: Rajnath
'పాక్​, అమెరికాలా కాదు.. భారత్​ ఎప్పటికీ లౌకికరాజ్యమే'

కులమతాలకు అతీతంగా పౌరులందరూ కలిసిమెలసి జీవించే లౌకిక రాజ్యం.. భారతదేశమని పునరుద్ఘాటించారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​. అంతేగానీ పాకిస్థాన్ లాగా ఎప్పటికీ మతాధికార పాలిత రాజ్యంగా మారదన్నారు. అమెరికాను కూడా మతాధికారిత రాజ్యపాలనగా అభివర్ణించారు రాజ్​నాథ్​. దిల్లీలో జరిగిన ఎన్​సీసీ రిపబ్లిక్​ డే క్యాంప్​లో పాల్గొన్న ఆయన.. ​ భారతదేశం ఒక మతానికి చెందిన దేశంగా ఎప్పుడూ ప్రకటించుకోలేదని గుర్తుచేశారు.

పొరుగు దేశమైన పాకిస్థాన్​.. తమకు ప్రత్యేక మతం ఉన్నట్లు ప్రకటించుకుందని, అంతేగానీ హిందూ, సిక్కు, బౌద్ధలు ఇలా ఏదో ఒక మతాధికార దేశంగా తామెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు​. మన సరిహద్దుల్లో నివసించే వారినే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరినీ కులుపుకునే స్వభావం భారతీయులదని చెప్పారు. 'వసుదైక కుటుంబం' అనే సందేశం భారత్​ నుంచే ప్రపంచ దేశాలకు విస్తరించినట్లు తెలిపారు రాజ్​నాథ్​.

ఇదీ చూడండి : సీఏఏపై స్టేకు సుప్రీం నో- రాజ్యాంగ ధర్మాసనానికి కేసు బదిలీ

Intro:Body:

Blank

Conclusion:
Last Updated : Feb 17, 2020, 11:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.