రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల కార్యక్రమం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రఖ్యాత జానపద గాయని తేజాబా 'పద్మవిభూషణ్' పురస్కారం అందుకున్నారు.
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్, ప్రముఖ వ్యాపారవేత్త మహా ధర్మపాల్ గులాటి, పర్వతారోహకురాలు బచేంద్రిపాల్లు పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
'పద్మశ్రీ' పురస్కార గ్రహీతల్లో ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛత్రి, క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఆర్చరీ క్రీడాకారిణి బొంబాల దేవి తదితరులు ఉన్నారు.
ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 112 మందికి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 11న జరిగిన కార్యక్రమంలో 47 మందికి పద్మ పురస్కారాలు అందించారు. మిగిలిన వారికి ఈ రోజు ప్రదానం చేశారు.