అసోంలో బీభత్సం సృష్టించిన వరదలు తగ్గుముఖం పట్టాయి. అయితే 56,89,584 మందిపై వరదలు ప్రభావం చూపాయని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మే 22న ప్రారంభమైన ఈ వరదల ధాటికి.. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 109 మంది ప్రాణాలు కోల్పోయారు.
బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. 621 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 81,678 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
వరదల కారణంగా రాష్ట్రంలో సుమారు 2,62,723 హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది.
ఇదీ చదవండి: బిహార్లో 40 లక్షల మందిపై వరదల ప్రభావం!