ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'ఫిట్ ఇండియా' ప్రచార కార్యక్రమంలో ఇప్పటివరకు 10 కోట్ల మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కార్యక్రమం ప్రచారంపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రచారంలో భాగంగా సీఆర్పీఎప్ దివ్యాంగుల దళాలు... అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి దిల్లీకి 16 రోజుల్లో 1,000 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ పూర్తి చేసిన సందర్భంగా మట్లాడారు రిజిజు. ఈ సైకిల్ ర్యాలీ.. శాంతి, దృఢ సంకల్పం, అభిరుచి వంటి సందేశాలు ఇస్తుందన్నారు. దీని వల్ల చాలా మందిలో ప్రేరణ కలుగుతుందన్నారు. 'దేశ పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు' అని రాజ్‌ఘాట్‌లో జరిగిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ర్యాలీలో రిజిజు తెలిపారు.
దేశ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యమే ధ్యేయంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని 2019, ఆగస్టు 29న ప్రారంభించారు మోదీ.
ఇదీ చూడండి: 'ఫిట్నెస్ ప్రోటోకాల్స్'ను ప్రారంభించిన మోదీ