పుల్వామాలో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది భారత సైన్యం. పుల్వామా జిల్లాలోని మాచ్చిహమ్లో జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. అయితే.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కశ్మీర్ ఎన్కౌంటర్: పుల్వామాలో మరో ముష్కరుడు హతం - One more terrorist killed in JK encounters
11:29 September 24
పుల్వామాలో మరో ముష్కరుడు హతం
10:06 September 24
కశ్మీర్ ఎన్కౌంటర్- సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
జమ్ముకశ్మీర్‌లో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందారు. బుద్గాం జిల్లాలోని చాదూరా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో గాయపడిన జవాన్‌ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ జవాన్ మృతి చెందినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఓ ఉగ్రవాది హతం
అవంతిపొరాలోని మాఘామా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంలో గాలింపు చర్యలు చేపట్టాయి భద్రతా బలగాలు. వీరిని చూసి కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. అనంతరం ఎదురుదాడికి దిగిన సైనికులు.. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. అయితే.. ఉగ్రవేట ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.
08:58 September 24
కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్ అవంతిపొరాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతమయ్యాడు. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. తారసపడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ముష్కరుడు మృతి చెందగా.. మిగతా వారి కోసం దళాలు గాలిస్తున్నాయి.