జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్ జరిగింది. బందిపొర జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడిని భద్రతా దళం హతమార్చింది.
శ్రీనగర్‌కు సమీపంలోని లాదార గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టింది భద్రతా సిబ్బంది. ఈ నేపథ్యంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రవాదుల చర్యలను బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. మరణించిన ఉగ్రవాది గుర్తింపుపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.
ఇదీ చూడండి:'5 ఎకరాల భూమి స్వీకరణపై చర్చించాకే నిర్ణయం'