ఒకే దేశం- ఒకే రేషన్‌కార్డు పథకం జూన్ 1 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్ర పౌరసరఫరాల శాఖమంత్రి రాంవిలాస్ పాసవాన్. పలు ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానునట్లు రాజ్యసభ వేదికగా ప్రకటన చేశారు. నూతన విధానం ద్వారా రేషన్‌కార్డులు కలిగిన వారు దేశంలోని ఏ ప్రాంతంలో అయినా సరుకులు పొందే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఆధార్ కార్డుల అనుసంధానం ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి అవుతుందని సమాచారం.
ఇప్పటికే 12 రాష్ట్రాల్లో...
ఇప్పటికే ఈ పథకం 12 రాష్ట్రాల్లో అమలులో ఉందన్నారు పాసవాన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, త్రిపుర, గోవా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌లల్లో జనవరి 1 నుంచే అమలవుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ముంబయి కాలా చౌకీలో అగ్నిప్రమాదం