జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గృహనిర్బంధం నుంచి విడుదలయ్యారు. ఆయనపై పెట్టిన ప్రజా భద్రతా చట్టాన్ని ఎత్తివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం ప్రకటించింది.
గతేడాది ఆగస్టు 5న కశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా సహా కశ్మీర్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది.
ఒమర్ అబ్దుల్లా 232 రోజులు (సుమారు 8 నెలలు) గృహ నిర్బంధంలో ఉన్నారు. మొదట అయన్ను ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్న కశ్మీర్ ప్రభుత్వం తర్వాత ప్రజాభద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఆయన తండ్రి, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కూడా ఇటీవలే గృహనిర్బంధం ఎత్తివేశారు.
ఇదీ చూడండి: కరోనాపై జాతినుద్దేశించి నేడు మోదీ ప్రసంగం