కర్ణాటకలోని దావనగెరె జిల్లా హరిహర తాలుకాలో తుంగభద్ర నదీ వంతెనపై నుంచి ప్రయాణిస్తున్నాడు ఆ యువకుడు. వరద ప్రవాహంతో మనోహరంగా కనిపించింది ఆ ప్రదేశం. ఆ ప్రకృతి అందాల నడుమ తన రూపాన్ని ఫోన్ కెమెరాలో బంధించాలనుకున్నాడా యువకుడు. ఫోన్ తీసి కెమెరాతో సెల్ఫీలు మొదలు పెట్టాడు.
నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డుకు అవతలి పక్క ఉన్న ఓ వృద్ధుడు కెమెరాలో కనిపించాడు. వెనక్కి తిరిగి చూశాడు నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది. వెంటనే గట్టిగట్టిగా కేకలువేసి చుట్టుపక్కలవారిని అప్రమత్తం చేశాడు. స్పందించిన స్థానిక ప్రజలు వృద్ధుడిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు.
ఆ పెద్దాయన ఎవరు, ఎన్ని కష్టాల్లో ఉన్నాడో తెలీదుగానీ, క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోకుండా చేసిన సెల్ఫీ చిత్రానికి ఇప్పుడు లైక్స్ క్యూ కట్టాయి.
ఇదీ చూడండి: 'ఒక్క సినిమాతోనే జీవితం సెటిలైపోయింది