ఒడిశా తీరంలో ఈ ఏడాది అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూరీ జిల్లాలోని కోనార్క్ చంద్రభాగ బీచ్‌లో సైకత కళాకారులు రూపొందించిన శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ మార్పులు, కాలుష్యం, కొవిడ్ వంటి పులు థీమ్‌లతో సందేశం అందించారు.
![International Sand Art Festival](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9733484_sand2-2.jpg)
కొవిడ్ ప్రభావం..
ప్రతిఏటా సైకత కళా ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి కళాకారులు హాజరవుతారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి విదేశీయులు హాజరవ్వలేదు. 70 మంది భారతీయ కళాకారులు మాత్రమే హాజరయ్యారు.
![International Sand Art Festival](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9733484_sand3.jpg)
థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ తర్వాతే సందర్శకులను అనుమతిస్తున్నారు.
![International Sand Art Festival](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9733484_sand4.jpg)
ఇదీ చూడండి: గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది?