ఉమ్ పున్ తుఫాన్.. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర- వాయవ్య దిశగా సాగుతోంది. గత ఆరు గంటలుగా గంటకు 6 కిమీ వేగంతో తుఫాన్ ప్రయాణిస్తోంది. అయితే ఉమ్ పున్... భారీ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం బులిటెన్ ఆధారంగా కేంద్ర హోంశాఖ హెచ్చరించింది.
"రాబోయే 6 గంటల్లో ఇది మరింత ఉద్ధృతంగా మారనుంది. తరువాతి 12 గంటల్లో అతి భారీ తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఇది మే 20 మధ్యాహ్నం లేదా సాయంత్రానికి బంగాల్లో తీరం దాటనుంది."
-హోంశాఖ అధికారి
బంగాల్, ఒడిశాలో తుఫాన్ ప్రభావాన్ని దీటుగా ఎదుర్కోవడం, అత్యవసర సాయం అందించడంపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వం వహించారు.
ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం...
ఒడిశాలో తుఫాన్‌ను ఎదుర్కోవడానికి 10 జాతీయ విపత్తు స్పందన బృందాలను (ఎన్డీఆర్ఎఫ్) 7 జిల్లాల్లో మోహరించారు. కటక్ ముండాలనిలో 7 బృందాలను సిద్ధం చేశారు.