దిల్లీలో వాయుకాలుష్య తీవ్రత తగ్గించేందుకు నేటి నుంచి సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నిబంధనలు వర్తిస్తాయి. నేడు సరి సంఖ్య ఉన్న వాహనాలకే దేశ రాజధానిలో అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.
సరి-బేసి విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు దిల్లీలో సుమారు 200 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమించినవారికి రూ.4 వేలు జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే బేసి సంఖ్య నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న పలు వాహనాలకు చలానా వేశారు పోలీసులు.
దిల్లీలో సరి- బేసి విధానం ఇంతకుముందు అమల్లో ఉండేది. ఈ విధానంపై ప్రజలకు ముందుగానే అవగాహన కలిగేలా ప్రచారం నిర్వహించింది దిల్లీ ప్రభుత్వం.
ఇదీ చూడండి: దిల్లీ కాలుష్యం: ఆయువు తోడేస్తున్న వాయువు