కరోనా వేళ దాదాపు వాయిదా పడ్డట్టే అనుకున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. కొవిడ్ వైరస్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్దకు వచ్చిన విద్యార్థులకు సిబ్బంది మాస్కులు అందజేసి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించారు. విద్యార్థులను లోపలికి అనుమతించే ముందు మెటల్ డిటెక్టర్ల సాయంతో తనిఖీ చేశారు.
ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో బీఆర్క్ ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్‌కు మొత్తం 8,58,273 మంది దరఖాస్తు చేసుకున్నారు. 224 ప్రాంతాల్లో మొత్తం 489 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బుధవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. వీటి కోసం 605 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు నిర్ధేశిత సమయానికే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కేంద్రం మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని తేల్చిచెప్పింది. చెప్పినట్టే నేడు జేఈఈ మెయిన్స్ పరీక్ష మొదలైంది.
వివిధ రాష్ట్రాల్లో కరోనా వేళ పరీక్ష ఇలా...
ఉత్తర్ ప్రదేశ్, లఖ్‌నవూ, ప్రబంధ్ నగర్ లో విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి.. మాస్కులు, గ్లౌజులు ఇచ్చి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.
యూపీ, గోరక్ పుర్ లో కరోనా జాగ్రత్తల్లో భాగంగా.. భౌతిక దూరం పాటిస్తూ.. మైకుల సాయంతో విద్యార్థులకు దిశానిర్థేశం చేశారు.
కేరళ, కొచ్చి అలువాలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులను శానిటైజ్ చేసే యంత్రాలు ఏర్పాటు చేశారు.
జమ్ము కశ్మీర్ లో జేఈఈ పరీక్ష కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఏడాది పరీక్షలు వాయిదా వేయకుండా పరీక్షలు నిర్వహించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఝార్ఖండ్, రాంచీలో పలు పరీక్ష కేంద్రాల వద్ద ఇతర కరోనా జాగక్రత్తలతో పాటు భౌతిక దూరాన్ని కచ్చితంగా అమలు చేశారు.
-
#WATCH: Candidates queue up outside TCS at Patto Plaza in Panaji, Goa - designated as an exam centre for #JEEMain. They are being made to discard their masks and are being provided fresh masks after their temperature is checked, in the wake of #COVID19. pic.twitter.com/oekpUNmqlk
— ANI (@ANI) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: Candidates queue up outside TCS at Patto Plaza in Panaji, Goa - designated as an exam centre for #JEEMain. They are being made to discard their masks and are being provided fresh masks after their temperature is checked, in the wake of #COVID19. pic.twitter.com/oekpUNmqlk
— ANI (@ANI) September 1, 2020#WATCH: Candidates queue up outside TCS at Patto Plaza in Panaji, Goa - designated as an exam centre for #JEEMain. They are being made to discard their masks and are being provided fresh masks after their temperature is checked, in the wake of #COVID19. pic.twitter.com/oekpUNmqlk
— ANI (@ANI) September 1, 2020
చండీగఢ్, బిహార్, ఛత్తీస్ గఢ్, గోవా సహా దేశమంతా ఇదే పద్ధతి కొనసాగింది. గోవా, పనాజీ పట్టో ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఓ పరీక్ష కేంద్రంలో .. విద్యార్థులు పెట్టుకొచ్చిన మాస్కులు ధ్వంసం చేసే ఏర్పాటు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాక , కొత్త మాస్కులిచ్చి లోనికి అనుమతించారు.
ఇదీ చదవండి: మత సామరస్యాన్ని చాటుతూ.. ముస్లిం యువతి యక్ష'గానం'..