ETV Bharat / bharat

రైళ్లలో వారు ఊరెళ్లడం ఇక మరింత ఈజీ - శ్రామిక్‌ రైళ్ల స్టాపులు ప్రయాణికుల సంఖ్యలో మార్పులు

వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేరవేసేందుకు నడుపుతున్న ప్రత్యేక శ్రామిక్‌ రైళ్ల స్టాపులు, ప్రయాణికుల సంఖ్యలో మార్పులు చేసింది రైల్వేశాఖ. రైలు బయలు దేరిన చోటు నుంచి మూడు స్టాపుల్లో ఆపాలని.. ప్రయాణికుల సంఖ్యను 1200 నుంచి 1700లకు పెంచాలని నిర్ణయించింది.

Now, around 1,700 passengers, three stoppages for 'Shramik Special' trains
శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు మూడు స్టాపుల్లోనే ఆగుతాయి!
author img

By

Published : May 11, 2020, 1:08 PM IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించే శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల స్టాపుల్లో మార్పులు చేసింది రైల్వే శాఖ. రైలు బయలు దేరిన చోటు నుంచి 3 స్టేషన్లలో ఆపాలని నిర్ణయించారు అధికారులు. ఈ రైళ్లలో ప్రస్తుతం 1200మంది ప్రయాణిస్తున్నారు. అయితే ఆ సంఖ్యను 1700లకు పెంచుతున్నట్లు తెలిపారు. రైల్వే జోన్ల ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బోగీకి 72 మంది మాత్రమే..

రైళ్ల సామర్థ్యానికి తగిన విధంగా స్లీపర్‌ బెర్తలు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. శ్రామిక్‌ రైలులో 24 బోగీలు ఉంటాయి. భౌతిక దూరం దృష్ట్యా ప్రతి బోగీలో ప్రస్తుతం 54మంది ప్రయాణికులనే అనుమతిస్తున్నారు. ఆ సంఖ్యను 72కు పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

2020 మే 1 నుంచి ఇప్పటి వరకు 5లక్షల మంది ప్రయాణికులను స్వస్థలాలకు చేరవేసినట్లు తెలిపారు.

"రోజుకు 300 రైళ్లు నడుపుతున్నాం. వాటిని మరింత పెంచాలనే యోచనలో ఉన్నాం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో వలస కార్మికులందర్నీ తమ ప్రాంతాలకు చేరవేస్తాం.''

- రైల్వే శాఖ సీనియర్‌ అధికారి

ఇదీ చూడండి: స్వీయ నిర్బంధంలో ఉండాలా? కొత్త రూల్స్ ఇవే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.