ETV Bharat / bharat

దిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలపై సుప్రీం అసంతృప్తి - సుప్రీం కోర్టు తాజా వార్తలు

దిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు కాలుష్యాన్ని నివారించేందుకు ఏం చేశారో తెలపాలని సంబంధిత కమిషన్​ను ఆదేశించిన న్యాయస్థానం.. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరింది.

Not satisfied with work done by Commission for Air Quality Management, says SC
దిల్లీ కాలుష్య నివారణ చర్యలపై సుప్రీం అసంతృప్తి
author img

By

Published : Dec 17, 2020, 8:56 PM IST

దేశ రాజధాని దిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ చర్యలపై.. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్​(సీఏక్యూఎమ్​)పై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఈ సమస్యపై తమతో పాటు దిల్లీ ప్రజలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సత్వర చర్యలు చేపట్టి కాలుష్యాన్ని అదుపులోకి తేవాలని కమిషన్​కు సూచించింది.

వాయు కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కమిషన్​ను ఆదేశించింది న్యాయస్థానం. ఈ విషయమై త్వరలోనే సమగ్ర వివరాలు అందజేస్తామని చెప్పింది సీఏక్యూఎమ్​.

కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం అనేక రకాలుగా ప్రయత్నిస్తోందని కేంద్రం తరఫు న్యాయవాది సొలిసిటర్​ జనరల్​ తుషార్ అన్నారు.​ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన కేంద్రం చర్యలు చేపడుతోందని చెప్పారు.

ఇదీ చదవండి: సాగు చట్టాల ప్రతులను చించేసిన కేజ్రీవాల్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.