దేశమంతటికీ హిందీ ఉమ్మడి భాషగా ఉండాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టారు మక్కల్ నీది మయ్యం పార్టీ(ఎంఎన్ఎం) వ్యవస్థపాకుడు కమల్ హాసన్. 'భిన్నత్వంలో ఏకత్వం' అనేది దశాబ్దాల క్రితం దేశం చేసిన వాగ్దానమని పేర్కొన్నారు. దానిని షా, సుల్తాన్, సామ్రాట్ ఎవరూ విస్మరించకూడదని వీడియో ద్వారా సందేశం అందించారు కమల్.
భారత్‌ను 'వివిధ భాషల కలయిక అయిన గొప్ప విందు భోజనం'గా అభివర్ణించారు కమల్ హాసన్. హిందీని దేశవ్యాప్తంగా అమలు చేస్తామనే ప్రయత్నం ఇబ్బందులకు గురిచేస్తుందని హెచ్చరించారు. దేశంలోని భాషలన్నింటినీ గౌరవిస్తాం కానీ తమ మాతృభాష ఎప్పటికీ తమిళమేనని స్పష్టం చేశారు కమల్.
జల్లికట్టు కన్నా పెద్దఎత్తున..
2017లో తమిళనాడులో జల్లికట్టు నిషేధంపై జరిగిన ఆందోళనలను గుర్తు చేశారు కమల్. అది కేవలం నిరసన మాత్రమే.. కానీ భాష కోసం జరిగే యుద్ధం దాని కన్నా పెద్దగా ఉంటుందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: హిందీ రగడ: షా వర్సెస్ ప్రాంతీయ పార్టీలు