ETV Bharat / bharat

ఉద్యోగికి కరోనా వస్తే ఆఫీస్​ మూసేయాలా? - union health ministry latest news

పని ప్రదేశాలు, కార్యాలయాల్లో కొవిడ్ నియంత్రణకు పాటించాల్సిన మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఒకటి, రెండు కేసులుంటే కార్యాలయాలను పూర్తిగా మూసివేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

No need to shut entire office building
'కరోనా కేసులు ఎక్కువ ఉంటేనే ఆఫీస్​ మూసివేయాలి'
author img

By

Published : May 19, 2020, 7:27 PM IST

Updated : May 19, 2020, 8:09 PM IST

లాక్​డౌన్ 4.0లో కార్యాలయాలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో పని ప్రదేశాల్లో కరోనా నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు విడుదల చేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఒకటి, రెండు కేసులు నమోదైన కారణంగా కార్యాలయ భవనాన్ని పూర్తిగా మూసివేయాల్సిన అవసరం లేదని తెలిపింది. నిబంధనల మేరకు కార్యాలయ భవనాన్ని క్రిమిసంహారకాలతో శుద్ధి చేసిన అనంతరం కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. వైరస్​ సోకిన వ్యక్తి గత 48 గంటల్లో తిరిగిన ప్రదేశాలన్నింటినీ శుభ్రం చేయాలని పేర్కొంది.

ఒకవేళ కార్యాలయ పరిధిలో కరోనా కేసుల సంఖ్య రెండు కంటే ఎక్కువ ఉంటే మాత్రం మొత్తం భవనాన్ని 48 గంటల పాటు మూసివేయాలని చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఆ ప్రదేశం మొత్తాన్ని క్రిమిసంహారకాలతో శుద్ధి చేసి అధికారుల అనుమతి పొందిన తర్వాతే తిరిగి తెరవాలని నిర్దేశించింది. ఈ సమయంలో ఉద్యోగులు ఇంచి నుంచి పని చేసేలా చూడాలని సూచించింది.

ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే స్థానిక వైద్య అధికారులకు సమాచారం అందించాలని, 1075 హెల్ప్​లైన్​ను సంప్రదించాలని ఆరోగ్య శాఖ తెలపింది. ఒకవేళ వైరస్ ఉన్నట్లు నిర్దరణ అయితే రోగి కలిసిన వ్యక్తులను, తిరిగిన ప్రదేశాలను ట్రేస్​ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించింది.

కార్యాలయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు

  • ఆఫీస్​లో ఉద్యోగులు, సందర్శకులు తప్పనిసరిగా ఒక మీటరు భౌతిక దూరం పాటించాలి.
  • తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
  • తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • కంటైన్​మెంట్ జోన్లలో ఉన్న ఉద్యోగులు హోం క్వారంటైన్​లో ఉండాల్సి వస్తే, వారికి ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలి.

Last Updated : May 19, 2020, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.