ETV Bharat / bharat

మెట్రోలో ఉచిత సేవలు వద్దు: సుప్రీంకోర్టు

దిల్లీలో మహిళలకు మెట్రోలో ఉచిత ప్రయాణ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. ఈ ప్రతిపాదన వల్ల దిల్లీ మెట్రో రైల్​ కార్పొరేషన్  (డీఎంఆర్​సీ) నష్టాపోతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

మెట్రోలో ఉచిత సేవలు వద్దు: సుప్రీంకోర్టు
author img

By

Published : Sep 6, 2019, 11:15 PM IST

Updated : Sep 29, 2019, 5:19 PM IST

దిల్లీ మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన ప్రాజెక్టును ప్రైవేటు​ సంస్థలైన ఫ్రీబైస్​, సాప్స్​కు ఇచ్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రీం. దిల్లీ మెట్రో వ్యవస్థను నాశనం చేయాలని అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఈ ఉచిత సేవల విషయంలో వెనక్కుతగ్గాలని జస్టిస్​ అరుణ్​ మిశ్రా, జస్టిస్​ దీపక్​ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మెట్రో నాల్గో దశకు సంబంధించి మూడు విషయాలను విచారించింది. మెుదటిది నిర్మాణ సమయంలో వచ్చిన నష్టాన్ని భరించటం, రెండవది జపాన్​ ఇంటర్నేషనల్​ కో-ఆపరేషన్​ ఏజెన్సీకి ఇవ్వవలసిన మెుత్తం చెల్లించటం, మూడవది మెట్రోకు సంబంధించిన భూ ఖర్చులు.

నాల్గో దశ భూ​ సమస్యలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, దిల్లీ ప్రభుత్వాలు 50: 50 శాతం ఖర్చు భరించాలని ఆదేశించింది​. భూ ఖర్చులకు ఇవ్వవలసిన ధనాన్ని మూడు వారాలోగా చెల్లించాలని, ఈ దశకు అవసరమైన రూ.2447.19 కోట్లను త్వరగా విడుదల చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్​ 23న చేపట్టనున్నట్లు తెలిపింది.

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ ఈ ఏడాది జూన్​ మాసంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మెట్రోలో రోజుకు సుమారు 18.6లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

ఇదీ చూడండి:జాబిల్లిని ముద్దాడే వేళ... విక్రమ్​, ప్రజ్ఞాన్​ పరిహాసాలు

Intro:Body:Conclusion:
Last Updated : Sep 29, 2019, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.