బిహార్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఆదివారం భేటీ కానున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సమావేశం కానున్న కూటమి భాగస్వామ్య పక్షాలు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తమ నేతగా ఎన్నుకోనున్నాయి.
ఎన్డీఏలో జేడీయూతో పాటు భాజపా, హిందుస్థానీ అవామీ మోర్చా(హెచ్ఏఎం), వికాస్ శీల్ ఇన్సాన్(వీఐపీ) పార్టీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించగా.. భాజపా 74 సీట్లతో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 43 చోట్ల గెలుపొందింది. ఐతే నితీశ్ కుమారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్డీఏ పక్షాలు నితీశ్‌ను తమ నేతగా ఎన్నుకోవడం లాంఛనం కానుంది.
ఇదీ చూడండి: సోమవారమే సీఎంగా నితీశ్ ప్రమాణం!