నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందులో భాగంగా సంవత్సరానికి ఒక బ్యాంక్ ఖాతా నుంచి కోటి రుపాయలు తీసే వారిపై 2శాతం టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) విధించాలని నిర్మల ప్రతిపాదించారు.
"డిజిటల్ లావాదేవీల ప్రచారానికి మా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. వీటిని ముందుకు తీసుకెళ్లడానికి, నగదు రహిత వ్యాపారం కోసం మరిన్ని కఠిన చర్యలు చేపట్టాలి. ఒక బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి కోటి రూపాయలు తీసే వారిపై 2 శాతం టీడీఎస్ విధించాలని నేను ప్రతిపాదిస్తున్నా."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి.
50 కోట్లకన్నా ఎక్కువ వార్షిక ఆదాయమున్న వ్యాపారులు... డిజిటల్ విధానంలో లావాదేవీలు జరిపితే ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించారు నిర్మల. ఈ మినహాయింపు వ్యాపారులకు, వినియోగదారులకు వర్తిస్తుందని తెలిపారు.