నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. దోషుల్లో ఒకడైన పవన్‌కుమార్ గుప్తా తనకు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోర్టుకు విన్నవించాడు. అదే సమయంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పుపై స్టే విధించాలని తన పిటిషన్లో పేర్కొన్నాడు గుప్తా.
మిగతా ముగ్గురు దోషులైన ముఖేశ్‌కుమార్, వినయ్‌శర్మ, అక్షయ్‌కుమార్ తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. అయితే క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్షపై సవాలు అవకాశాలను పవన్‌కుమార్ గుప్తా ఇంకా వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలోనే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు గుప్తా.
మార్చి 3న నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు జరపాల్సి ఉంది. అయితే చట్టంలో ఉన్న అవకాశాలను వినియోగించి శిక్షను పొడిగిస్తూ వస్తున్నారు దోషులు. ఈ నేపథ్యంలో పవన్‌కుమార్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్‌తో ఉరి అమలు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి: నిర్భయకు న్యాయమేది? పేరుకేనా మరణ దండన?