ETV Bharat / bharat

నిర్భయ దోషికి న్యాయ సహాయం- ఆశాదేవి కంటతడి

నిర్భయ కేసులో దోషుల ఉరి అమలు కోసం కొత్త డెత్​ వారెంట్​ జారీ చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది ట్రయల్​ కోర్టు. దోషి పవన్​ గుప్తాకు న్యాయ సహాయం అందించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో కోర్టు ఆవరణలోనే భావోద్వేగానికి లోనయ్యారు నిర్భయ తల్లి. న్యాయం జరుగుతుందని విశ్వాసం కోల్పోతున్నానని కంటతడి పెట్టుకున్నారు.

Nirbhaya case
నిర్భయ దోషికి న్యాయ సహాయం- ఆశాదేవి కంటతడి
author img

By

Published : Feb 12, 2020, 3:56 PM IST

Updated : Mar 1, 2020, 2:29 AM IST

నిర్భయ దోషుల ఉరి అమలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నలుగురు దోషులకు శిక్ష అమలు చేసేందుకు కొత్త డెత్​ వారెంట్​ జారీ చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది ట్రయల్​ కోర్టు.

డెత్​ వారెంట్​ జారీ కోసం కింది కోర్టుకు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం ట్రయల్​ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు ఆలకించింది. ఈ క్రమంలో దోషి పవన్​ గుప్తా తనకు న్యాయవాది లేరని తెలిపాడు. పవన్​ అభ్యర్థన మేరకు న్యాయసహాయం అందించేందుకు అంగీకరించింది కోర్టు. దోషులు చివరి శ్వాసవరకు న్యాయసహాయం పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది.

తన న్యాయవాదిని తొలగించానని.. కొత్త లాయర్​ను నియమించుకునేందుకు మరింత సమయం కావాలని పవన్​ గుప్తా కోరాడు. అయితే.. పవన్​ వైపు ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు అడిషనల్​ సెషన్స్​ జడ్జ్​ ధర్మేందర్​ రానా.

నిర్భయ తల్లి కంటతడి..

నూతన డెత్​ వారెంట్​పై విచారణ రేపటికి వాయిదా వేయటంపై భావోద్వేగానికి లోనయ్యారు నిర్భయ తల్లి ఆశా దేవి. కోర్టు ప్రాంగణంలోనే కంటతడి పెట్టుకున్నారు. రోజురోజుకూ విశ్వాసం కోల్పోతున్నానని.. శిక్ష తప్పించుకునేందుకు చేస్తున్న వ్యూహాలను కోర్టు గ్రహించాలని కోరారు. పవన్​ గుప్తాకు కొత్త న్యాయవాదిని ఏర్పాటు చేస్తే ఉరి శిక్ష అమలు మరింత ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆశా దేవి.

ఆశాదేవి కంటతడి

ఇదీ చూడండి: బాలికపై 10 మంది అత్యాచారం- ఐదుగురు అరెస్ట్

Last Updated : Mar 1, 2020, 2:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.